»   » పుస్తకాల్లో చదివా.. ఇప్పుడు చేస్తున్నా: అనుష్క

పుస్తకాల్లో చదివా.. ఇప్పుడు చేస్తున్నా: అనుష్క

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్: 'ఇంత వరకూ నేను పాఠ్య పుస్తకాల్లోనే రుద్రమ దేవి గురించి చదివా. ఇప్పుడు ఆమె పాత్రని నేనే వేస్తున్నా అని తలచుకుంటే చాలా ఆనందంగా ఉంది. చరిత్రని గుర్తు చేసే పాత్రల్లో చేయడం నిజంగా అదృష్టమే' అంటోంది అనుష్క. గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె ప్రధానపాత్రలో రుద్రమదేవి అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై చాలా నమ్మకాలు పెట్టుకుంది అనుష్క. ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది.

  అరుంధతి సినిమా మూలంగా - అనుష్క హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు న్యాయం చేయగలదనే నమ్మకం దర్శకుల్లో కలిగింది. ఆ నమ్మకమే ఓ గౌరవం అని భావిస్తుంటాను. ఇప్పుడు రుద్రమదేవి రూపంలో ఓ మంచి చిత్రం దక్కింది. మరోసారి నటిగా నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఎంచుకొన్న ప్రతి చిత్రం నా మనసుకి నచ్చిందే అనుకొంటాను అని చెప్పింది.

  అరుంధతి తరవాత మీ దగ్గరకి అలాంటి కథలతోనే ఎక్కువమంది వచ్చారా? అని అడిగితే ''వచ్చారు. కానీ నేను అంగీకరించలేదు. మంచి పాత్ర అయితే ఒప్పుకొనేదాన్నే. కానీ ఏవీ నచ్చలేదు. .. ''ఫలానా పాత్ర నన్ను వెతుక్కుంటూ ఎప్పుడు వస్తుందా అని కలలుగనడం నాకు నచ్చదు. నా దగ్గరకి వచ్చిన పాత్రల్లో న్యాయం చేయగలిగే వాటినే ఎంచుకుంటాను. నేను ఏ పాత్రలకు బాగా సరిపోతానో నాకంటే దర్శకులకే బాగా తెలుసు'' అని చెబుతోంది అనుష్క.

  ''సినిమా షూటింగులతో క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. యోగాని వదిలేశారా?' అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. యోగాని వదలడమనేది జరగదు. ఎందుకంటే అది నా జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. నా అందానికీ, ఆరోగ్యానికీ అదీ ఒక కారణమే కదా, అందుకే రోజులో దానికీ కచ్చితంగా కొంత సమయం కేటాయిస్తా' అంటోంది అనుష్క. రాణి రుద్రమ పాత్ర చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

  English summary
  Anushka has done quite a few experimental characters and is still continuing to do so. One of her future projects is a period film, Rani Rudrama Devi. She plays the title role and the story is set in the 13th century. For this role, we hear she is getting to ready to wield swords and knives. She is undergoing special training to look good while performing these fight scenes, it seems.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more