»   » ‘వర్ణ’ రిజల్ట్‌పై అనుష్క స్పందన

‘వర్ణ’ రిజల్ట్‌పై అనుష్క స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క, ఆర్య జంటగా తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'వర్ణ' (తమిళంతో ఇరండం ఉలగమ్) చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాలతో తెరకెక్కిన ఈచిత్రానికి విమర్శకులు, ప్రేక్షకుల నుంచి నుంచి తక్కువ మార్కులే పడ్డాయి.

దాదాపు రూ. 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం పెట్టుబడి రాబట్టుకుంటుందా? లేదా? అనేది సందేహంగా మారింది. వర్ణ రిజల్ట్‌పై హీరోయిన్ అనుష్క ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 'సినిమా విడుదలై కనీసం ఒక వారమైనా కాలేదు. ఇంత త్వరగా సినిమా జయాపజయాలపై మాట్లాడటం సరికాదు. సినిమా ఎంతో బాగా వచ్చింది. ఇలాంటి సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ' అని అనుష్క తెలిపారు.

'వర్ణ' ఒక రొమాంటిక్ ఫాంటసీ ఫిల్మ్. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం సెల్వరాఘవన్. రెండు విభిన్నమైన లోకాల నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తుంది. ఈచిత్రంలో ఆర్య, అనుష్క ద్విపాత్రాభినయం చేసారు. ఈ చిత్రంలో క్యారెక్టర్ కోసం ఆర్య సిక్స్ ప్యాక్ బాడీ పెంచడం విశేషం. చిత్రంలోని పోరాట సన్నివేశాల కోసం ఆర్య, అనుష్క కత్తి యుద్ధంలో శిక్షణ పొందారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అందమైన లొకేషన్లతో పాటు, జార్జియా దేశంలోని అడవుల్లో, గోవా, రియో డె జానెరియో, బ్రిజిల్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఈచిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందించగా, అనిరుద్ రవిచంద్రన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసారు. రామ్ జీ సినిమాటోగ్రఫీ అందించారు. ఫరూఖ్, సత్యం శివకుమార్, సోనుసూద్, ఢిల్లీ గణేష్, అను హాసన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అవతార్ చిత్రానికి పని చేసిన హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈచిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు.

English summary
"It's too early to talk about a film's fate. We have done a good and unique attempt considering its novel plot. I know there is mixed response to the film but I've no regrets for being part of this film. Right from my childhood, I'm so fascinated about fantasies." Anushka told.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu