»   » పవన్ తో సినిమా చేయడానికి బెదురుతున్న అనుష్క!

పవన్ తో సినిమా చేయడానికి బెదురుతున్న అనుష్క!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనుష్క పై మనసు పారేసుకొన్న అప్పటి మెగాస్టార్ చిరంజీవి 'స్టాలిన్" చిత్రంలో ఓ ప్రత్యేక ఐటం సాంగ్ లో నటింపజేసుకోవడం తెలిసిందే. తాజాగా చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్ను కూడా అనుష్క పై పడిందని తెలుస్తోంది. 'కొమరం పులి" అనంతరం 'పులి' పవన్ కళ్యాణ్ తో, 'అరుంధతి' అనుష్క జతకట్టబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా విజయభాస్కర్ దర్శకత్వంలో గణేష్ బాబు ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలోనే పవన్ కళ్యాణ్ సరసన అనుష్క నటించబొతోందట.

ఈ చిత్రానికి బడే రవి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడని సమాచారం. మే నెలలో ఈ చిత్రం ఆరంభం అవుతుందని వినికిడి. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం. అయితే, ఎంతకీ పూర్తవ్వని మహేష్ చిత్రంలో నటించేందుకు అంగీకరించి తప్పు చేసానని ఇప్పటికే రెండు చేతులతో లెంపలు వేసుకుంటున్న అనుష్క, పవన్ కళ్యాణ్ గురించి తెలిసి తెలిసి ఎలా అంగీకరించడమా అని తర్జనభర్జన పడుతున్నదని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu