»   » అనుష్కకి గడ్డు పరిస్ధితి...రెమ్యునరేషన్ లో భారీ కోత

అనుష్కకి గడ్డు పరిస్ధితి...రెమ్యునరేషన్ లో భారీ కోత

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో హాట్ ప్రాపర్టీగా ఎదిగిన అనుష్క పరిస్ధితి ఇప్పుడేమీ బాగోలేదు. నాగార్జున ఢమురుకం, ప్రభాస్ రెబెల్ తప్ప ఆమె కొత్తగా కమిటయిన చిత్రాలు ఏమీ లేవు. యంగ్ హీరోలు ఆమెను తమ ప్రక్కన బుక్ చేసుకోవటానికి భయపడుతున్నారు. ఖలేజాలో మహేష్ కు అక్కలా ఉందని కామెంట్స్ రావటంతో కుర్ర హీరోలు ఆమెపై ఆసక్తి చూపటం లేదు.ఇంట్రస్ట్ ఉన్న గోపిచంద్ పై అనుష్కకు ఇంట్రస్ట్ లేదు. ఇక సీనియర్స్ లో నాగార్జున తప్ప ఆమెను ఎంకరేజ్ చేస్తున్న వారు కనపడటం లేదు. ఇదిలా ఉంటే మరో ప్రక్క కాజల్, తాప్సీ, సమంత, హన్సిక అంటూ రోజుకో హీరోయిన్ తెరపైకి వచ్చేసి మార్కెట్లో వాటాకి వచ్చేస్తోంది. దాంతో అనుష్కకి వేదంలాంటి పాత్రలు తప్ప ఆమెకు రావటంలేదు.ఈ నేపధ్యంలో ఆమె తన రెమ్యునేషన్ లో భారీ కోత విధించుకుందని సమాచారం. కోరి వచ్చిన నిర్మాతను ఎట్టి పరిస్దితిల్లోనూ వదలకూడదనే సిద్దాంతంతో ఆమె ముందుకువెళ్తోంది. అదీ సంగతి.

English summary
Anushka offers came down and it is heard that Anushka has decided to performance oriented roles here after instead of glamorous roles. She is also offering huge discounts for the producers who come with performance oriented roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu