»   » ఆ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం...

ఆ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అరుంధతి అనంతరం క్రేజీ స్టార్ గా మారిపోయిన అనుష్క తాజాగా ద్వి పాత్రాభినయం చేస్తూ ముందుకొస్తోంది. సముద్ర దర్శకత్వంలో రూపొందిన 'పంచాక్షరి' చిత్రంలో ఆమె డబుల్ రోల్ లో కనపించి అలరించనుంది. ఈ విశేషాన్ని అనుష్క స్వయంగా మీడియాకు తెలియచేస్తూ...ఈ చిత్రంలో నేను ద్విపాత్రాభినయం చేశాను. ఒక పాత్ర గ్రామీణ యువతి 'పంచాక్షరి' కాగా, మరో పాత్ర నగర యువతి హనీ. ఈ ద్విపాత్రాభినయం చాలా వైవిధ్యంగా ఉంటుంది. నా కేరెక్టర్‌తోపాటు చిత్రంలోని అనేక పాత్రలు విభిన్నంగా ఉంటాయి. దర్శకుడు ఎంతో ఓర్పుతో, ప్రశాంతంగా షూటింగ్ చేశారు. ఒక మంచి చిత్రం ద్వారా నిర్మాతగా మారిన బొమ్మదేవర రామచంద్రరావుకు ఈ సినిమా శుభారంభాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ, 'నిర్విరామంగా జరిగిన ఒకే షెడ్యూలులో షూటింగ్ పూర్తి చేశాం. చిత్రం చాలా అద్భుతంగా రూపొందింది. అనుష్క నటించిన 'అరుంధతి' ద్వారా ఏర్పడిన అంచనాలను అధిగమించి, గొప్ప హిట్ చిత్రంగా నిలిచేలా మా 'పంచాక్షరి' రూపొందింది. గొప్ప సినిమా తీయాలన్న ఉద్దేశంతో నిర్మాత అయిన మేకప్‌మాన్ రామచంద్రరావు ఈ చిత్రం ద్వారా తన కల నిజం చేసుకుంటారు' అన్నారు. అక్కినేని నాగార్జున సమర్పకుడిగా సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై రామచంద్రరావు నిర్మిస్తున్న ఈ 'పంచాక్షరి' చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక అనుష్క ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సరసన కలేజా చిత్రంలో చేస్తోంది. అలాగే నటి భూమిక నిర్మిస్తున్న తకిట తకిట చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే దర్శకుడు వీరూపోట్ల రూపొందించే కొత్త చిత్రంలో నాగార్జున సరసన కమిట్ అయ్యింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu