»   » మెగాస్టార్ పక్కన ఛాన్స్ రావాలే కానీ..ఎగిరి గంతేస్తా...

మెగాస్టార్ పక్కన ఛాన్స్ రావాలే కానీ..ఎగిరి గంతేస్తా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి సరసన ఛాన్సొస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు..నేనూ అందుకు మినహాయింపేమీ కాదంటోంది హీరోయిన్ అనుష్క. రీ ఎంట్రీలో చిరంజీవి మళ్ళీ తెలుగు తెరపై అదరగొట్టేయడం ఖాయమంటోన్న అనుష్క, 'స్టాలిన్" లో ఓ ఐటెమ్ సాంగ్ లో చిరంజీవి సరసన తనకు ఛాన్సొచ్చిందనీ, ఆ ఒక్క పాట షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆయన ఉన్నత వ్యక్తిత్వమేమిటో తనకు అర్థమయ్యిందని చెబుతోంది.

ఇక, 150వ సినిమా కోసం బాగా స్లిమ్ అయ్యే పనిలో బిజీగా వున్న చిరంజీవి ప్రస్తుతం న్యూ లుక్ తో కన్సిస్తున్నారు. వినాయక్, రాజమౌళి తదితరులు చిరంజీవికి ఇప్పటికే కొన్ని కథలు చెప్పారనీ, వాటిల్లో ఏదో ఒకటి ఫైనలైజ్ అవుతుందనే ఊహాగానాలతో పాటు, శంకర్ తో చిరంజీవి సినిమా చేయబోతున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోన్న సంగతి విదితమే. ఆల్రెడీ టాలీవుడ్ మీడియా, చిరంజీవి సరసన అనుష్క హీరోయిన్ కన్ ఫర్మ.. అంటూ గాసిప్స్ ప్రచారం చేసేస్తుండడంతో, చిరంజీవి సైతం తనకు సరిజోడి అనుష్క అని భావించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu