»   » బాహుబలి : అనుష్క కూడా ఎంటరైంది

బాహుబలి : అనుష్క కూడా ఎంటరైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : హాట్ హీరోయిన్ అనుష్క రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇప్పటిరకు ప్రభాస్, రాణాలపై మాత్రమే షూటింగ్ జరిగింది. తాజాగా ఈ షూటింగులో అనుష్క కూడా జాయినైంది. ఆమెతో పాటు నటి రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు కూడా షూటింగులో పాల్గొంటున్నారు.

తొలి షెడ్యూల్ కర్నూలు ప్రాంతంలోని కొండ ప్రాంతంలో జరిగింది. తాజాగా రెండో షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టనుంది. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రభాస్ సోదరుడి పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో రమ్యకృష్ణ ప్రభాస్ తల్లి పాత్రలో నటిస్తోంది. దర్శకుడు రమ్య కృష్ణకు చిత్రంలోని ప్రధాన కథను, ఆమె పాత్రలో విశిష్టతను చెప్పడంతో, దాదాపు కోటి రూపాయల పారితోషికాన్ని ఇవ్వజూపడంతో ఈ పాత్రను చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు.

ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. 'బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ ఆధ్వర్యంలో సెట్స్ వేసారు.

English summary
Anushka enter into Baahubali movie shooting. Baahubali directed by SS Rajamouli. Prabhas, Anushka, Rana are doing the lead roles while Adivi Sesh, Sudeep are also doing some special roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu