»   » నాగార్జునపై అనుష్కకి స్పెషల్ ఇంట్రస్టు అందుకేట

నాగార్జునపై అనుష్కకి స్పెషల్ ఇంట్రస్టు అందుకేట

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగ్‌తో పని చేయడం అంటే ప్రాణం హాయిగా ఉంటుందని చెప్తోంది అనుష్క. ఎందుకని అంటే...రెగ్యులర్ గా..షూటింగ్‌ వాతావరణం చాలా గందరగోళంగా ఉంటుంది. ఎవరెవరో ఏదోదో మాట్లాడుతుంటారు. అసలు కొన్ని సందర్భాల్లో అయితే ఎవరు ఏమంటున్నారో కూడా తెలీదు. అదే సెట్‌లో నాగార్జున ఉన్నారనుకోండి. అక్కడ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఎవరి పనులు వాళ్లు శ్రద్ధగా చేసుకొంటారు. సెట్‌లో ఎవరైనా ఇబ్బందికరంగా మాట్లాడితే నాగార్జునకు నచ్చదు. వారిని పిలిచి గట్టిగా మందలిస్తారు. అలాంటి వారికి అక్కడ చోటు లేదు. అందుకే నాగార్జున నచ్చుతారు అంటోంది అనుష్క. ఇక వీరిద్దరి కాంబినేషన్ 'సూపర్‌'తో మొదలై 'రగడ' వరకూ కొనసాగింది. అలాగే నాగార్జున, శ్రీనివాసరెడ్డి కాంబినేషన్ లో రానున్న 'ఢమరుకం'లోనూ వీళ్లే జంటగా కనిపిస్తారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu