»   » నాగార్జున సమర్పణలో ..అనుష్క 'పంచాక్షరి'

నాగార్జున సమర్పణలో ..అనుష్క 'పంచాక్షరి'

Posted By:
Subscribe to Filmibeat Telugu

'సూపర్' చిత్రంలో నాగార్జున సరసన చేసిన అనుష్కతో ఆయన అనుభందం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత నాగార్జునతో 'డాన్' చిత్రంలో హీరోయిన్ గా చేసింది. నాగార్జున 'కింగ్' చిత్రంలో లో ఓ పాటలో కనిపించి అలరించింది. అలాగే అనుష్క ప్రధాన పాత్రలో భూమిక నిర్మిస్తున్న 'తకిట తకిట' చిత్రంలో నాగార్జున గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఆమె హీరోయిన్ గా చేస్తున్న 'పంచాక్షరి' చిత్రాన్ని నాగార్జున సమర్పిస్తున్నాడు. 'అరుంధతి' ఘనవిజయం స్పూర్తితో అనుష్క ప్రధాన పాత్రలో ఈ 'పంచాక్షరి' చిత్రం రూపొందుతోంది. వి.సముద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో సామ్రాట్ అనే కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్నాడు. నాగార్జున పర్శనల్ మేకప్ మేన్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రం లోగో అన్నపూర్ణ స్టూడియోలో ఆవిష్కారం చేసారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రియల్ లో రిలీజ్ కాబోతోంది. సముద్ర ఈ చిత్రానికి ముందు భూమికతో 'మల్లెపూవు', జగపతి బాబుతో 'అధినేత' చిత్రాలు రూపొందించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu