»   » మీడియాపై విరుచుకుపడ్డ అనుష్క (వీడియో)

మీడియాపై విరుచుకుపడ్డ అనుష్క (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: పర్శనల్ క్వచ్చిన్స్ తో అనుష్క శర్మ విసిగిపోయినట్లుంది. ముఖ్యంగా ఆమెను మీడియా చుట్టుముట్టినప్పుడల్లా ఆమె బోయ్ ఫ్రెండ్ విరాట్ కోహ్లి గురించి, అతనితో డేటింగ్ లైఫ్ గురించి అడుతున్నారు. దాంతో ఆమె తన సొంత సినిమా ప్రమోషన్స్ కు వెళ్ళినా ఇవే హైలెట్ అవుతున్నాయి. దాంతో ఆమెతో పనిచేసే దర్శక,నిర్మాతలకు చాలా ఇబ్బందిగా మారింది. తాజాగ ఆమె ఎన్ హెచ్ 10 ప్రమోషన్ లో పర్శనల్ మరియు ప్రెవేట్ లైఫ్ కు సంభందించిన ప్రశ్నలు అడగవద్దని చెప్పినా... పదే పదే అడగటంతో ఆమె మండిపడింది. ఆమెకు ఏ ప్రశ్నకు కోపం వచ్చింది. ఎలా రియాక్టైంది అనేది ఈ వీడియోలో ఇక్కడ చూడవచ్చు.

ఇక మరో ప్రక్కన సెమీఫైనల్లో విరాట్‌ వైఫల్యానికి బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ కారణమంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఒక రన్ తో అవుట్ అయిన కోహ్లి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేయటంతతవారు విరాట్ మీదే కూకుండా అనుష్క శర్మ ని సైతం ఆడిపోసుకుంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ నేపధ్యంలో వివాదాస్పద నటుడు కమాల్ ఆర్ ఖాన్ అయితే మరింతగా జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. అనుష్క శర్మ ఇంటిపైన రాళ్లు విసరండి...తన సినిమాలను బహిష్కరించండి. ఇండియా మ్యాచ్ గెలవకపోవటానికి కారణం అనుష్క శర్మే. ఆమె సినిమాలను ఎవరైతే చూస్తారో వారు దేశ ద్రోహులు అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అలాగే అనష్క శర్మ వారందరనీ వెనక్కి తీసుకురావటానికి వెళ్లందంటూ ఈ ఫొటో ని సైతం పోస్ట్ చేసాడు.

Anushka fires at Reporter!

అంతేకాదు...అనుష్క శర్మ మ్యాచ్ చూడటానికి వెళితే ఇండియా ఓడిపోతుందని చెప్పాను. అదే జరిగింది అని కూడా పోస్ట్ చేసాడు. ఈ వివాదస్పద మెసేజ్ లు మరిన్ని సమస్యలు మూలం అవుతాయో అని అంటున్నారు. చాలా మంది కమాల్ ని తప్పు పడుతున్నారు.

''అనుష్క సిడ్నీ వెళ్లి తప్పు చేసింది. దేశం ఆమెను క్షమించదు.. అనుష్కది అసలైన ప్రేమ.. తన ప్రియుడు చేసే ఒక్కపరుగు చూసేందుకు సిడ్నీ దాకా వెళ్లింది'' అంటూ ట్విటర్‌లో కొందరు ఆమెను ఆడిపోసుకున్నారు. అనుష్కను నిందిస్తున్నవారికి బుద్ధి లేదంటూ కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిచారు.

వారిని భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తప్పుబట్టాడు. ''అనుష్క చేసిన నేరమేంటి. ఇతర ఆటగాళ్ల సన్నిహితులు, కుంటుంబ సభ్యుల లాగే ఆమె కూడా మ్యాచ్‌ చూసేందుకు వెళ్లింది. కోహ్లి విఫలమైతే అనుష్కను నిందించడం తప్పు. అలా చేస్తున్నవారికి మానసిక పరిపక్వత లేదు'' అని గంగూలీ అన్నాడు.

English summary
Anushka Sharma lost her cool to end up questioning why such stupid questions were asked and said digging into someone's private life doesn't excite the viewers of the channel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu