»   » 'సైజ్‌ జీరో' టీం నుంచి అనుష్క కి స్పెషల్‌ గిఫ్ట్‌ (వీడియో)

'సైజ్‌ జీరో' టీం నుంచి అనుష్క కి స్పెషల్‌ గిఫ్ట్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హీరోయిన్‌ అనుష్క జన్మదిన సందర్భంగా 'సైజ్‌ జీరో' చిత్ర బృందం ఆమెకు ఓ ప్రత్యేక వీడియోను బహుమతిగా ఇచ్చారు. స్వీటీకి(అనుష్క) జిలేబీ, లడ్డు వంటి తీపి పదార్థాలంటే ఎంత ఇష్టమో వర్ణిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

Thank you Size Zero Movie team for such a sweeeeeeeeet video... Loved it!!!


Posted by Anushka Shetty on 7 November 2015

దీనికి అనుష్క స్పందిస్తూ వీడియో చాలా స్వీట్‌గా ఉందంటూ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వంలో అనుష్క, ఆర్యలు జంటగా నటించిన 'సైజ్‌ జీరో' చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.


సైజ్ జీరోలో కింగ్ నాగార్జున ఓ అతిధి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే, తెలుగు వెర్షన్ లో మాత్రమే నాగార్జున కనిపిస్తారు. తమిళ వెర్షన్ కి క్రేజీ యంగ్ హీరో జీవా నాగర్జున పాత్రలో నటిస్తారని సమాచారం.


హీరో ఆర్యకి క్లోజ్ ఫ్రెండ్ గా నటిస్తుండటం విషేషం ఎందుకంటే ఈ ఇద్దరూ ఇదివరకే బాస్ ఎంగిర భాస్కరన్ చిత్రంలో కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి జీవా తన స్నేహితుడు ఆర్య కోసం ఈ క్యారెక్టర్ చేస్తున్నాడుట.


Anushka get special gift from Size Zero

నిర్మాత మాట్లాడుతూ ''బొద్దుగా కనిపించే ఓ అమ్మాయి అందమైన ఆకృతి కోసం ప్రయత్నించిన విధానం చుట్టూ సాగే కథ ఇది. తన నడుమును సన్నజాజి పువ్వులా మార్చుకొనేందుకు ఎలాంటి పాట్లు పడిందో తెరపైనే చూడాలి. వినోదమే ప్రధానంగా తెరకెక్కింది. ఆర్య, అనుష్క మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు, వినోదం ప్రేక్షకులకు నచ్చుతాయి. కీరవాణి సంగీతం, నీరవ్‌ షా కెమెరా పనితనం సినిమాని ప్రధాన బలం. చేసిన ప్రచార చిత్రాలకి చక్కటి స్పందన లభించింది'' అన్నారు.


అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిర్వాషా, ఆర్ట్: ఆనంద్ సాయి, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెల మూడి.

English summary
Size Zero team gave a Special gift Video to Anushka for her Birthday.
Please Wait while comments are loading...