»   » ఎలాగైనా తన సరాదా తీర్చుకోవాలంటున్న అనుష్క..!?

ఎలాగైనా తన సరాదా తీర్చుకోవాలంటున్న అనుష్క..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ సినిమాల్లో రాణించక, బాలీవుడ్ పై దృష్టి సారించడం హీరోయిన్లకు సర్వసాధారనమైన విషయమే. అనుష్క మాత్రం బాలీవుడ్ సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. టాలీవుడ్ లోనూ, కోలీవుడ్ లోనూ బిజీగా వున్నాను కదా..ఇక్కడి సినిమాలు చేసుకుంటే చాలు..ఇక్కడి ప్రేక్షకుల అభిమానం చాలు..అంటూ సౌత్ సినిమాకే ఫిక్సయిపోయిన అనుష్క ఆలోచనల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందట.

తాను హీరోయిన్ గా నటించిన 'సింగం" సినిమా హిందీలోకి రీమేక్ అవుతుండడం..అందులో తన పాత్రను కాజల్ పోషిస్తుండడంతో, అనుష్క కూడా బాలీవుడ్ తన సత్తా చాటుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇకపై బాలీవుడ్ నుంచి వచ్చే అవకాశాల్ని వదులుకోనని అంటోంది అనుష్క కొన్ని కారణాలవల్ల బాలీవుడ్ సినిమాల్ని ఒప్పుకోలేకపోయాననీ, ఇకపై బాలీవుడ్ నుంచి వచ్చే ఆఫర్స్ ని అందిపుచ్చుకుంటానని అనుష్క చెబుతోంది. శ్రియ, అసిన్, త్రిష, ఇలియానా, తాజాగా కాజల్..ఇలా సౌత్ బ్యూటీస్ అంతా బాలీవుడ్ మీద కన్నేసిన దరిమిలా, తానూ బాలీవుడ్ సరదా తీర్చుకోవాలని ఆరాటపడ్తోన్న అనుష్క ఏ మేరకు బాలీవుడ్ అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే..

English summary
Anushka Shetty is now a days busy with Tollywood and Kollywood and now her beauty and popularity flows to Bollywood too.Thats why bollywood directors and producers offering her to act in bollywood at any cost.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu