»   » పవన్‌కు వచ్చిన సమస్యే అనుష్కకు... కొత్త సినిమాలు సైన్ చేయడం లేదు!

పవన్‌కు వచ్చిన సమస్యే అనుష్కకు... కొత్త సినిమాలు సైన్ చేయడం లేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
పాపం..పవన్‌కు వచ్చిన సమస్యే అనుష్కకు...!

గత కొన్నేళ్లుగా తెలుగు హీరోయిన్ అనుష్క విరామం లేకుండా పని చేస్తున్నారు. వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజి బిజీగా గడుపుతున్నారు. అందులో రుద్రమదేవి, బాహుబలి, బాహుబలి 2 లాంటి భారీ యాక్షన్ చిత్రాలు ఉన్నాయి. సైజ్ జీరో లాంటి సినిమాల కోసం బరువు పెరగడం, తర్వాత 'భాగమతి' కోసం తగ్గడం లాంటివి చేశారు.

ఇలా అలుపు లేకుండా కష్టపడుతున్న అనుష్కకు కొత్త సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం ఆమె తీవ్రమైన నడుము నొప్పితో బాధ పడుతున్నారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇలానే తీవ్రమైన బ్యాక్ పెయిన్‌తో బాధపడిన సంగతి తెలిసిందే.

 నొప్పిని భరిస్తూ ‘భాగమతి'

నొప్పిని భరిస్తూ ‘భాగమతి'

‘భాగమతి' సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ప్రారంభంలోనే మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు అనుష్క మరో కొత్త సినిమాకి సంతకం చేయలేదు. అందుకు కారణం నడుము నొప్పి అని అంటున్నారు. నొప్పిని భరిస్తూనే కొన్ని రోజులు ‘భాగమతి' షూటింగులో పాల్గొన్నారట అనుష్క.

చికిత్స తీసుకుంటున్న అనుష్క

చికిత్స తీసుకుంటున్న అనుష్క

నొప్పి తగ్గించుకోవడానికి అనుష్క నేచురల్‌ థెరపీతో చికిత్స తీసుకుంటున్నారట. చికిత్స పూర్తవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ప్రస్తుతం ఏ సినిమాలకు సంతకం చేయడం లేదని సమాచారం.

బరువు తగ్గిన అనుష్క

బరువు తగ్గిన అనుష్క

నడుపునొప్పి తగ్గించుకునే క్రమంలో అనుష్క బరువు కూడా బాగా తగ్గారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా అనుష్క బయట కనిపించడం లేదు. త్వరలో ఆమె న్యూలుక్ తో ఇటు అభిమానులను, మీడియాను సర్‌ప్రైజ్ చేయబోతున్నారు.

భాగమతి మూవీ

భాగమతి మూవీ

‘పిల్ల జమిందార్' ఫేం అశోక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో .. థ్రిల్లింగ్ గా అనిపించే స్క్రీన్ ప్లే తో ఈ సినిమా తెరకెక్కుతోంది. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ భాగమతి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాల భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

English summary
According to a leading daily, Tollywood actress Anushka has been suffering from a backache for quite a while and it has hindered her fitness regime. Talking about this, a source said that Anushka has gone in for natural therapy. And, that is why the process is talking time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu