»   » అనుష్కకు చుక్కలు చూపించిన ఫ్యాన్స్

అనుష్కకు చుక్కలు చూపించిన ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరుమల: తిరుమల దివ్యక్షేత్రం భక్తకోటితో నిండిపోయింది. ముఖ్యంగా బాహుబలి టీమ్ అంతా స్వామి వారిని దర్శనం చేసుకుని వెళ్ళింది. ఆ క్రమంలో తిరుమల కొండపైకి ఈ రోజు ఉదయం వెళ్ళిన నటి అనుష్క కు అభిమానులు చుక్కలు చూపించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


శనివారం రాత్రి బాహుబలి ఆడియో ఫంక్షన్ జరగటంతో యూనిట్ లోని కొంతమంది సబ్యులు స్వామివారిని చూద్దామని బయిలు దేరారు. ఈ క్రమంలోనే కొంతదూరం నడకదారిలో దర్శనానికి వెళ్లిన అనుష్కకు అభిమానుల నుంచి తీవ్ర నిరాశ ఎదురైంది.


Anushka irritated by Fans

ఆమెను చూసేందుకు అభిమానులు ..క్యూ కట్టడంతో చాలా అసహానానికి గురయ్యారు. ఓ దశలో అభిమానుల అదుపు తప్పి అనుష్క మీద పడబోయారు. దీంతో ఆమె విసుక్కుంటూ అతికష్టమ మీద ఆలయం వద్దకు కారు ద్వారా చేరుకున్నారు.


ఇక ఈ వేసవి సెలవుల్లో ఎన్నడూ లేనంతగా అశేషసంఖ్యలో యాత్రికులు తిరుమల కొండకు తరలివచ్చారు. ప్రస్తుతం భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు కిటకిటలాడుతున్నాయి. భక్తులు కిలోమీటర్ల దూరం వరుసల్లో నిరీక్షిస్తున్నారు.


అధిక రద్దీ కారణంగా అద్దె గదుల కొరత తీవ్రంగా ఉంది. తితిదే ఈవో సాంబశివరావు భక్తుల మధ్యే ఉండి సౌకర్యాలను పర్యవేక్షించారు. నిన్న వేకువ జాము నుంచి అర్థరాత్రి వ రకు లక్షా 719 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు తితిదే ప్రకటించింది.

English summary
Anushka visited Tirumala Today for the darshan of Lord Venkateswara Swamy. She faced a bad experience when she preferred to go by walk for the darshan. Soon after spotting her, Fans came running towards the lanky actress and tried to shook hands with her.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu