Don't Miss!
- News
ప్యాకేజీ స్టార్ దేశభక్తి ఇది.. రిపబ్లిక్ డే సాక్షిగా మళ్ళీ దొరికిన పవన్ కళ్యాణ్!!
- Finance
world economy: ప్రపంచ దేశాల ఆర్థిక ర్యాంకుల్లో మనమెక్కడ ?
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఆధిపత్య పోరులో నాకు నేనే సాటి..నాతోనే నాకు పోటీ
నాకు నేనే సాటి..నాతోనే నాకు పోటీ" అన్నట్లుగా ఉంది అందాల భామ అనుష్క పరిస్థితి. ఆమధ్య అనుష్క నటించిన 'పంచాక్షరి", 'వేదం", 'యముడు" చిత్రాలు మూడు వారాల వ్యవధిలో విడుదల కాగా, మళ్లీ ఇప్పుడు తాజాగా అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న 'నాగవల్లి", మెయిన్ హరోయిన్ గా నటిస్తున్న'రగడ"చిత్రాలు రెండు వారాల వ్యవధిలో విడుదల కానున్నాయి. కాబట్టి అనుష్కకు అనుష్కతోనే పోటీ తప్ప మరొక హీరోయిన్ తో కాదని తెలుస్తూనే ఉంది. వెంకటేష్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న'నాగవల్లి" ఆడియో విడుదల ఇటీవల జరగడం తెలిసిందే. అలాగే ఈనెలాఖరున నాగార్జునతో వీరు పోట్ల దర్శకత్వంలో డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న 'రగడ" పాటలు విడుదల కానున్నాయి. 'నాగవల్లి" డిసెంబర్ 2న విడుదలయ్యేందుకు సిద్దమవుతుండగా, సరిగ్గా రెండు వారాల వ్యవధితో 'రగడ" డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది!