»   » అనుష్క ముద్దు సూపర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ లక్కీ... హీరో సంచలన కామెంట్!

అనుష్క ముద్దు సూపర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ లక్కీ... హీరో సంచలన కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రణబీర్ సింగ్, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ, ఫావద్ ఖాన్ ప్రధాన పాత్రల్లో కరణ్ జోహార్ తెరకెక్కించిన చిత్రం 'యే దిల్ హై ముష్కిల్'. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించింది. తొలి నాలుగురోజుల్లోనే ఈ చిత్రం రూ. 100 కోట్లు వసూలు చేసింది.

చాలా కాలంగా సరైన హిట్ లేని రణబీర్ కపూర్... ఎట్టకేలకు తన ఖాతాలో పెద్ద హిట్టుపడటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. సినిమా సక్సెస్ మీట్లలో మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఉత్సాహంగా సమాధానాలు ఇస్తున్నాడు.

ఈ సినిమాలో రణబీర్ కపూర్ తనకంటే వయసులో పదేళ్లు సీనియర్ అయిన ఐశ్వర్యరాయ్, మరో హీరోయిన్ అనుష్క శర్మతో రొమాన్స్ చేసాడు. అయితే ముద్దు సీన్లు మాత్రం ఐశ్వర్యరాయ్ తో చేయలేదట, అనుష్కతో మాత్రమే ముద్దు సీన్లు చేసానని ఇటీవల ప్రెస్ మీట్ లో తెలిపారు.

అనుష్క ముద్దు సూపర్

అనుష్క ముద్దు సూపర్

యేదిల్ హై ముష్కిల్ మూవీలో ఐశ్వర్యరాయ్ తో రొమాంటిక్ సీన్లు ఉన్నప్పటికీ....ముద్దు సీన్లు లేవు. అనుష్కకే ముద్దులు పెట్టాను. నిజంగా అనుష్క బెటర్‌ కిస్సర్‌. అనుష్క బాయ్‌ఫ్రెండ్‌ విరాట్ కోహ్లి చాలా అదృష్టవంతుడు అంటూ రణబీర్ కపూర్ కామెంట్ చేసారు.

మూవీ వసూల్లు..

మూవీ వసూల్లు..

నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసింది. భారత్‌లో ఈ చిత్రం రూ.76 కోట్లకు పైగా వసూలు చేయగా ఓవర్‌సీస్‌లో 6.55 మిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.121.21 కోట్ల బిజినెస్‌ చేసి 2016లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఆరో చిత్రంగా నిలిచినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ వెల్లడించింది.

వివాదం

వివాదం

గోవా రాష్ట్ర పోలీస్ బాస్(డీజీపీ) చేసిన కామెంట్స్ సినిమాను మరోసారి వివాదంలో పడేసాయి. గోవా డీజీపీ ముక్తేశ్‌ చందర్‌ గాయకుడు మహ్మద్‌ రఫీ అభిమానులు ఈ సినిమాను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. సినిమాలో అలనాటి గాయకుడు మహ్మద్‌ రఫీని, ఆయన పాటలను అవమానపరిచారని, ఆయన అభిమానులంతా సినిమాను బహిష్కరించాలని డీజీపీ ట్వీట్‌ చేశారు.

కారణం ఏమిటి?

కారణం ఏమిటి?

సినిమాలో అనుష్క, రణ్‌బీర్‌ల మధ్య జరిగే ఓ సీన్లో ‘మహ్మద్‌ రఫీ.. ఆయన పాడటం తక్కువ. ఏడ్వటం ఎక్కువ కదా?' అంటూ ఓ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ మహ్మద్ రఫీ అభిమానుల మనసును గాయపరిచింది.

English summary
When quizzed who is the better kisser among Aishwarya Rai and Anushka Sharma during the media interaction, Ranbir Kapoor clarified he hasn't locked lips with the former Beauty Queen so far. Then, he added, 'I wish I could have kissed Anushka a lot more. She is a damn good kisser. Somebody (Virat Kohli) is lucky'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu