ప్రేమ, పెళ్లి గురించి పదహారేళ్లున్నప్పుడున్న కలలు ఇరవై దాటాక ఉండవని అనుష్క అంటోంది. ప్రేమ గురించి అడిగితే..ప్రేమా లేదూ, దోమాలేదు పని గురించి ఆలోచించడానికే టైం సరిపోవడం లేదు...ఇంకా ప్రేమ గురించి ఆలోచించే సమయమెక్కడిదీ..? అని ప్రశ్నిస్తోంది.
అయినా వదలకుండా..ఎవరినైనా ప్రేమించారా? అని అడిగితే, తెరమీద వెంటపడే హీరోలను ప్రేమించడానికే నాకు సమయం సరిపోతోంది. ఇక నిజ జీవితంలో ప్రేమ గురించి మాట్లాడటానికేముంది? అని ముక్తసరిగా చెబుతోంది.
ఒక వయస్సు వచ్చాక జీవితంలో నిజాలు కళ్లకు కనిపిస్తాయి. వరుడి గురించి నాలో పెద్దగా కలలు లేవు. మంచి మనిషి అయితే చాలంటోంది. మంచి మనిషంటే? అన్నిటికీ మించి నన్ను భరించేవాడుగా ఉండాలని అసలు విషయం చెప్పేసింది. మరి ఏం భరించాలని అడిగితే మాత్రం చెప్పట్లేదు. ప్రస్తుతం పి.వాసు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందనున్న 'చంద్రముఖి' సీక్వెల్ లో హీరోయిన్ గా అనూష్కని ఎంపిక చేసినట్లు సమాచారం.
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి | Subscribe to Telugu Filmibeat.