»   » పెళ్ళి కబురు చల్లగా చెప్పుకొచ్చిన అనుష్క..!

పెళ్ళి కబురు చల్లగా చెప్పుకొచ్చిన అనుష్క..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆదాయపు పన్ను శాఖ తన ఇంటిపై సోదాలు జరపడంతో ఆ మధ్య కాస్త మనోవేదనకు గురయ్యింది బెంగళూరు ముద్దుగుమ్మ అనుష్క. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఈ స్వీటీశెట్టికి ( అనుష్క ముద్దుపేరు) చాలా సమయమే పట్టింది. ఇక ఈ సంఘటన మరిచిపోతున్న తరుణంలోనే నాగచైతన్యతో ఆమె పెళ్ళి జరగబోతుందని, ఆల్‌డీ వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందనే వార్తలు అనుష్కను తీవ్రంగా కలిచివేశాయి.

ప్రస్తుతం తెలుగులో నాగార్జునతో డమరుకం, తమిళంలో కార్తీతో ఓ సినిమాలో నటిస్తున్న అనుష్క ఇటీవల ప్రభాస్‌తో నటిస్తున్న 'రెబల్" చిత్రం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అనుష్క సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయడానికి కారణం ఆమె మనసు పెళ్ళి వైపు లాగడమే ప్రధాన కారణమని టాలీవుడ్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై అనుష్క ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ' ప్రస్తుతం నాకు పెళ్ళి ఆలోచన లేదు. కానీ రెండేళ్ళ తర్వాత తప్పకుండా చేసుకుంటాను. నాకు నచ్చిన వ్యక్తి దొరికిన వెంటనే అందరికి నా పెళ్ళి కబురు చెప్పి చేసుకుంటాను" అని చెప్పుకొచ్చింది ఈ భామ.

English summary
Actress Anushka who was introduced to the Telugu screen through ‘Super’ has become a top heroine later. She is a top heroine now in Tollywood and kollywood . Marriage taboo appears to be haunting her these days. Earlier In a recent TV Interview, Anushka revealed that she was in a romantic relationship and will marry her boyfriend after two years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu