»   » నాగార్జున- వీరు పోట్ల సినిమాలో అనుష్క

నాగార్జున- వీరు పోట్ల సినిమాలో అనుష్క

Subscribe to Filmibeat Telugu

అనుష్క మళ్ళీ నాగార్జునతో నటించనుంది. వీరు పోట్ల దర్శకత్వంలో నాగార్జున సరసన ఆమే ప్రధాన హీరోయిన్. ఈ సినిమాను కామాక్షి మూవీస్ నిర్మించనుంది. బెంగళూరు భామ అనుష్కను మొదటిసారిగా తెలుగులోకి తెచ్చింది నాగార్జునే-సూపర్ సినిమా ద్వారా. నాగార్జున 'డాన్" లో కూడా హీరోయిన్ గా నటించింది. మరో రెండు నాగార్జున చిత్రాలు 'కింగ్', 'కేడి' చిత్రాల్లో ఆమె అతిధి పాత్రల్లో కన్పించింది.

'అరుంధతి" సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత అనుష్కకు అనేక పెద్ద అవకాశాలు వస్తున్నాయి. అయినా ఆమె నాగార్జున సరసన నటించడానికి ఇష్టపడుతుంది. అరుంధతి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో చక్కటి నటన ప్రదర్శించడానికి ఆమెకు అవకాశం దక్కింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu