»   » బాలకృష్ణ ‘పరమవీర చక్ర’ లో అనుష్క!

బాలకృష్ణ ‘పరమవీర చక్ర’ లో అనుష్క!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటసింహా బాలకృష్ణ నటించిన 'సింహా" చిత్రం ఘన విజయం సాధించడంతో అందరి కన్ను బాలయ్య పై పడింది. 'సింహా" విజయంతో ఆనందంగా ఉన్న సమయంలో బాలయ్యను రెండు బంపర్ ఆఫర్లు వరించిన సంగతి తెలిసిందే. దర్శక రత్న దాసరి నారాయణరావు, బాలకృష్ణ కాంబినేషన్ లో రాబోతున్న 'పరమవీరచక్ర" ఒకటైతే. మరొకటి పూరీజగన్నాథ్, బాలయ్య కాంబినేషన్ లో ఓ చిత్రం తెరెకెక్కనుంది.

కాగా దాసరి, బాలయ్య కాంబినేషన్ లో జూన్ 10న ప్రారంభం కానున్న 'పరమవీరచక్ర" చిత్రంలో హీరోయిన్ గా ఎవరిని పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకోసం నయనతార, అనుష్కల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాసరి మాత్రం అనుష్కను హీరోయిన్ గా పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారనీ సమాచారం.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu