»   » అనుష్క ‘పంచాక్షరి’

అనుష్క ‘పంచాక్షరి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

కథానాయికగా నాకు తొలి మేకప్ వేసినప్పుడు మేకప్ మాన్ చంద్ర 'నేను నిర్మాతగా తీసే మొదటి సినిమాలో నటిస్తావా? అనడిగారు. ఆయన సినిమా తీసేటప్పటికి నేనెక్కడుంటానో? అసలు సినిమా రంగంలో ఉంటానా? లేదా? అనుకున్నాను. అయినప్పటికీ చంద్రకి మాటిచ్చాను. 'అరుంధతి" తో ఫేం రావడంతో ఈ సినిమాని చేయండం లేదు. ఈ సినిమాకి అరుంధతి"కీ ఎటువంటి సంబంధం లేదు. బొమ్మి (చంద్ర) ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అద్బుతమైన కథతో 'పంచాక్షరి" చిత్రం రూపొందుతోంది అన్నారు అనుష్క.

ఆమె ప్రధాన పాత్రలో వి.సముద్ర దర్శకత్వంలో నాగార్జునకి మేకప్ మేన్ గా వ్యవహరించిన చంద్ర, నిర్మాతగా మారి తొలిప్రయత్నంగా 'పంచాక్షరి" అనే సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అనుష్క పై విధంగా స్పందించారు. 'నేను 'శివరామరాజు" చేస్తున్నప్పుడు 'తమ్ముడూ నా మొదటి సినిమాకి నువ్వే డైరెక్షన్ చేయాలి" అన్నారు" అని సముద్ర చెప్పారు. ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలకు శరవేగంగా రూపుదిద్దుకొంటున్నదని నిర్మాత తెలియజేశారు. ఇంకా ఈ చిత్రంలో సామ్రాట్, నాజర్, చంద్రమోహన్, ప్రదీప్రావత్, అలీ, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu