»   »  అమ్మో...అనుష్క తో జాగ్రత్తగా ఉండాలి

అమ్మో...అనుష్క తో జాగ్రత్తగా ఉండాలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. మన మనస్సులో ఉన్నది మన ముఖంలో,ముఖ్యంగా మన కళ్ళలో ప్రతిఫలిస్తుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అనుష్క ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారి కళ్ళని గమనిస్తూంటుందిట. అంటే మనస్సులో అనుష్క పై ఏదన్నా తేడా ఆలోచనలు ఉన్నా వెంటనే ఆమెకు తెలిసిపోతుందన్నమాట. కాబట్టి అనుష్క తో మాట్లాడేటప్పుడు కాస్త కంట్రోలులో ఉండటం మేలు. అలాగని కళ్ళు కనపడకుండా సన్ గ్లాసెస్ తో మ్యానేజ్ చేద్దామనుకుంటే వాళ్ళతో అసలు ఆమె మాట్లాడదట. కాబట్టి జాగ్రత్త.

అనుష్క మాట్లాడుతూ... ''చూపు, నవ్వు.. ఇవి చాలు ఆ మనిషి తత్వం ఏంటో తెలుసుకోవడానికి. అందుకే నేను ఎవరినైనా కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు మొదటగా ఇవే పరిశీలిస్తాను. అందుకే సన్‌గ్లాసెస్‌ పెట్టుకున్న వాళ్లతో నేను మాట్లాడను'' అంటోంది అనుష్క.

అలాగే ... ''మన చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే మన గురించి అవతలి వ్యక్తి ఏమనుకుంటున్నారో అనేది కూడా తెలుసుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడతాం. మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకొకటి మాట్లాడుతుంటారు. మనసులో ఏముందో కంటిచూపులో తెలిసిపోతుందంటారు. అందుకే నాతో మాట్లాడేవారి చూపులను, నవ్వును గమనిస్తాను. అప్పుడు ఆ వ్యక్తి ఎలాంటోడో తెలిసిపోతుంది కదా'' అంటూ చెప్పుకొచ్చింది అనుష్క.

Anushka : Reading the Mind in the Eyes

ప్రసుత్తం తమిళ, తెలుగు పరిశ్రమల్లో వరుస భారీ సినిమాలతో బిజీగా ఉందీ భామ. వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్న అనుష్క మరో పెద్ద ఆఫర్ ని తన ఖాతాలో వేసుకొంది. రజనీకాంత్ సరసన ఆమె హీరోయిన్ గా లింగా చిత్రంలో ఎంపిక అయ్యింది, కె.ఎస్ రవికుమార్ దర్శకుడుగా ఈ చిత్రం రూపొందుతోంది. గతంలోనూ రెండు సార్లు రజనీతో ఆమె ఛాన్స్ మిస్సైందని,ఈసారి ఎలాగయినా ఆయనతో నటించాలనే అనుష్క నిర్ణయిం తీసుకుని డేట్స్ ఎడ్జెస్ట్ చేయటానికి ముందుకు వచ్చిందని కోలివుడ్ సమాచారం.

అలాగే హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న అనుష్క మరో భారీ చిత్రం కమిటైంది. తమిళంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందే చిత్రం అది. అజిత్ హీరోగా తెరకెక్కె ఆ చిత్రం వేసవిలో సెట్స్ మీదకు వెళ్తుంది. ప్రస్తుతం ఆమె గుణశేఖర్ రుద్రమదేవి,రాజమౌళి బాహుబలిలో నటిస్తోంది. రెండు చిత్రాలలోనూ ఆమె రాని గా కనిపించనుంది. అయితే గౌతమ్ మీనన్ చిత్రంలో ఆమె అల్ట్రా మోడ్రన్ గెటప్ లో కనిపించనుందని తెలుస్తోంది.

హీరోయిన్ గా మీ విజయం వెనక రహస్యమేమిటని అనుష్కని అడిగితే... ''ఒక్కో అడుగే ముందుకేశాను. రోజూ సెట్‌లో ఏదో ఒకటి నేర్చుకొనేందుకు ప్రయత్నించాను. ఎప్పుడూ ఏ విషయంలోనూ ఆరాటపడలేదు. నా విజయం వెనక నా కృషి ఎంతుందో, చిత్ర పరిశ్రమ ప్రోత్సాహం కూడా ఉంది. దర్శకులు నాపై నమ్మకంతో మంచి మంచి పాత్రల్ని అప్పజెప్పారు. అవే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి''అని సెలవిచ్చింది.

అలాగే... ''నాకు కూడా మొదట్లో తెలుగు మాట్లాడటం వచ్చేది కాదు. ఎలాగో నటన గురించి ఏమీ తెలియదు, కనీసం భాష కూడా రాకపోతే ఎలా అనిపించేది. ఇక్కడ నిలదొక్కుకోవాలంటే మొదట తెలుగు నేర్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకొన్నా. అందుకే ఖాళీ సమయంలో తెలుగు టీవీ ఛానళ్లు ఎక్కువగా చూడటం అలవాటు చేసుకొన్నా. భాష అర్థమవ్వడం సులభమైపోయింది. తెలుగే కాదు... ఏ భాష నేర్చుకోవాలన్నా ఈ చిట్కా పాటించడం మంచిది'' అని చెప్పుకొచ్చింది అనుష్క.

English summary
A person's thoughts can be ascertained by looking in his or her eyes Said Anushka. She said that she can read others eyes. It is possible to read someone's thoughts by gazing into their eyes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu