»   » కండోమ్స్ ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలంటూ అనూష్క

కండోమ్స్ ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలంటూ అనూష్క

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎయిడ్స్ నివారణ కోసం నిమ్మగడ్డ ప్రసాద్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించిన కార్యక్రమానికి హాట్ హీరోయిన్ అనూష్క హాజరై మాట్లాడింది. ఆమె మాటల్లో...ఈ రోజుల్లో యువకులు చాలా సంభందాలు కలిగి ఉంటున్నారు. సాంఘీక సంక్షేమ సంఘాలు, సోషల్ ఆర్గనైజేషన్స్ వారు ఈ విషయమై యూత్ లో మార్పు తేవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే లెక్కలు, అంచనాలు ప్రకారం ఏ మార్పు రావటం లేదని అర్దమవుతోంది. సెల్ ఫోన్ చేతిలో ఎప్పుడూ ఎలా ఉంచుకుంటున్నారో. అలాగే యువత ఓ ప్యాకెట్ కండోమ్స్ ని కూడా ఎప్పుడూ దగ్గర ఉంచుకోవటం అలవాటు చేసుకోవాలి అని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫంక్షన్ ని మాట్రిక్స్ హెడ్, వైయస్ జగన్ క్లోజ్ బిజినెస్ పార్టనర్ అయిన నిమ్మగడ్డ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఇక అనూష్క నటించిన నాగవల్లి చిత్రం త్వరలో విడుదల కానుంది. అలాగే మహేష్ సరసన మళ్శీ ఆమె లింగు స్వామి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా వేట అని నిర్ణయించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu