»   » ఏడిపించారు: అనుష్క పేరు వెనక చిన్న స్టోరీ (ఫోటో ఫీచర్)

ఏడిపించారు: అనుష్క పేరు వెనక చిన్న స్టోరీ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దక్షిణాదిన తన అందచందాలు, పెర్ఫార్మెన్స్‌తో టాప్ హీరోయిన్‌గా దూసుకెలుతున్న అనుష్క అసలు పేరు స్వీటి. ఆమె పేరు అనుష్కగా మారడం వెనక ఓ చిన్న స్టోరీ కూడా ఉంది. చిన్నతనంలో ముద్దుగా పెట్టిన స్వీటీ అనే పేరే ఆమె పర్మినెంట్ పేరు అయిపోయింది. స్కూలు, కాలేజీలోనూ అదే ఉండేది. దీంతో అంతా ఆమెను ఏడిపించేవారట.

అప్పటి నుండి తన పేరు మార్చుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఈ మంగుళూరు బ్యూటీ 'సూపర్' సినిమాలో అవకాశం రావడంతో తన స్వీటీ అనే పేరు మార్చుకోవడానికి ఇదే సరైన సమయం అని ఫిక్సయింది. దాదాపు వారం రోజులు ఆలోచించి చించీ చివరకు అనుష్క అనే పేరు ఫిక్సయింది. అలా తన పేరు తనే పెట్టుకుంది అనుష్క.

అనుష్క సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆమె బెంగుళూరులోని ఈస్ట్‌వుడ్ పాఠశాలలో కూడా పని చేసారు. నాగార్జున హీరోగా రూపొందిన 'సూపర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన అనుష్క గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

అనుష్క

అనుష్క

అందాల ప్రదర్శనతో కుర్రకారులో మధురభావనలు రేపింది. వేదంలో సరోజగా కవ్వించినా, బిళ్లాలో బికినీతో కనిపించినా, విక్రమార్కుడుతో అందాలతో విజృభించినా, రగడతో అందాల రచ్చరచ్చ చేసినా ఆమెకే ఆమే పోటీ..సాటి అన్నట్లుగా వెండి తెరను వేడిక్కించింది.

భారీ ప్రాజెక్టులు

భారీ ప్రాజెక్టులు

ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మారింది. మొదట్లో అనుష్క అందాల ప్రదర్శనికే ప్రాధాన్యత ఇచ్చింది. అయితే అరుంధతి నుంచి ఆమె ఇమేజ్ మారింది. అందులో ఆమె అద్బుత నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా మారిన అనుష్క ఇప్పుడు భారీ పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.

బెస్ట్ ఆఫ్షన్ అనుష్క

బెస్ట్ ఆఫ్షన్ అనుష్క

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ల పాత్రలు కేవలం అందాల ఆరబోతకు, హీరోలతో రొమాన్స్ చేయడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. కానీ వీరందరికీ భిన్నంగా రాణిస్తోంది హాట్ అండ్ సెక్సీ తార అనుష్క. ఇటు గ్లామర్ పాత్రలతో పాటు ఇటు భారీ యాక్షన్ పాత్రలకు ఆమెను మించిన ఆప్షన్ తెలుగు ఫిల్మ్ మేకర్స్‌కు దొరకడం లేదు.

యాక్షన్ హీరోయిన్

యాక్షన్ హీరోయిన్

ఇప్పటికే అరుంధతి సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో తన సత్తా చాటిన అనుష్క త్వరలో మరో రెండు భారీ యాక్షన్ చిత్రాల్లో వెండి తెరపై తన తడాకా చూపెట్టబోతోంది. ప్రస్తుతం అనుష్క రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘బాహుబలి' చిత్రంతో పాటు, గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి' చిత్రాల్లో నటిస్తోంది.

English summary
Anushka revealing the secret behind her name. She said her parents in admission form filled her name as sweety and till college days she continued with the name. However in college days many teased that they thought sweety was a small girl which made her to change her name. She said after lot of thinking she decided that she will change her name as Anushka.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu