»   » విజువల్ ఎఫెక్ట్సే కారణమా! లేక...: అనుష్క భాగమతి ఎందుకు ఆగిపోయింది?

విజువల్ ఎఫెక్ట్సే కారణమా! లేక...: అనుష్క భాగమతి ఎందుకు ఆగిపోయింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనుష్క ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి వంటి సినిమాల్లో నటించి తన సత్తా చాటిన దేవసేన.. తాజాగా పిల్ల జ‌మీందార్ ఫేం అశోక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న భాగమతిలో నటిస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

భారీ అంచ‌నాలున్నాయి

భారీ అంచ‌నాలున్నాయి

బలమైన పాత్రలను కూడా అవలీలగా పోషించ‌గ‌ల‌న‌ని అరుంధ‌తి సినిమాతో అనుష్క ప్రూవ్ చేసింది. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తెర‌కెక్కుతున్న‌ 'భాగమతి' సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఆ అంచ‌నాల‌ను అందుకునేందుకు ఈ చిత్రంలోని విజువ‌ల్ ఎఫెక్ట్స్ పై ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఫోక‌స్ పెట్టారు.

అనుష్క లుక్‌

అనుష్క లుక్‌

ఈ సినిమాలో వి ఎఫ్ ఎక్స్ అద్భుతంగా రావాలనే ఉద్దేశంతో ఎక్కువ సమయాన్ని కేటాయించారు. భాగమతిలో అనుష్క లుక్ ఎలా వుంటుందని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ.. ఈ సినిమాలో అనుష్క లుక్‌ను త్వరలోనే విడుదల చేయాలని సినీ యూనిట్ భావిస్తోంది.

 భాగ‌మతి

భాగ‌మతి

సస్పెన్స్ థ్రిల్ల‌ర్ డ్రామాగా తెర‌కెక్కిన భాగ‌మతి చిత్రంలో అనుష్క ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా, ఆది పినిశెట్టి ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. భాగ‌మ‌తి చిత్రాన్ని తెలుగులోనే కాక‌ుండా త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లోను డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

 ఆగస్టు 15న

ఆగస్టు 15న

పిల్ల జమిందార్ ఫేం అశోక్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ భాగమతి. నిజానికి ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదల చేయాలనీ అనుకున్నప్పటికీ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతుండటంతో.. ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు.

12.5 కోట్లు

12.5 కోట్లు

అక్టోబర్ లో విడుదలయ్యే ఛాన్సుందట. ఇప్పటికే రెడీ అయిన ఫుటేజ్ ను ట్రైలర్ ను చూపెట్టేసి ఈ సినిమాను అమ్మేస్తున్నారట. అవిచూసిన ఒక బాలీవుడ్ డిస్ర్టిబ్యూటర్ హిందీ వర్షన్ ను ఏకంగా 12.5 కోట్లకు కొన్నాడట. తెలుగులో కూడా ఆల్రెడీ 40 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ అయిపోయిందని టాక్.

 వి ఎఫ్ ఎక్స్ వర్క్

వి ఎఫ్ ఎక్స్ వర్క్

ప్రస్తుతం ముంబైలో ఈ చిత్రం వి ఎఫ్ ఎక్స్ వర్క్ జరుగుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుగుతున్నాయి. నవంబర్ నాటికి మిగిలిన ప‌నులను పూర్తి చేసి, డిసెంబర్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రుద్ర‌మ‌దేవి త‌ర‌హాలోనే ఈ సినిమా తనకి మరింత క్రేజ్ ను తీసుకొస్తుందనే నమ్మకంతో అనుష్క వుంది.

English summary
Anushka's Bhagmati is slated to release on the eve of Independence day, August 15. Still, it is unclear an official announcement is yet to made by the filmmakers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu