»   » భాగమతి సక్సెస్ మీట్: అనుష్క భావోద్వేగం, దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

భాగమతి సక్సెస్ మీట్: అనుష్క భావోద్వేగం, దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Posted By: Santhosh Kumar Bojja
Subscribe to Filmibeat Telugu

అనుష్క ప్రధాన పాత్ర‌లో దర్శకుడు అశోక్ తెరకెక్కించిన చిత్రం 'భాగమతి'. న‌టించిన చిత్రం భాగ‌మ‌తి. యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గతవారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్‌తో మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

అనుష్క భావోద్వేగం

అనుష్క భావోద్వేగం

తాను మెయిన్ లీడ్‌గా చేసిన ‘భాగమతి' చిత్రం ఇంత పెద్ద హిట్ కావడంతో హీరోయిన్ అనుష్క భావోద్వేగంతో మాట్లాడారు. దర్శక నిర్మాతలతో పాటు ప్రతి టెక్నీషియన్‌ను పేరు పేరున అభినందించారు. ```భాగ‌మ‌తి` విడుద‌లైన రోజు నుండి నేటి వ‌ర‌కు పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతుంది. చాలా మంది లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాగా చేస్తున్నావ‌ని అంటుంటారు. ఒక మంచి బ్యాన‌ర్‌, టీం కుదిరిన‌ప్పుడే అది కుదురుతుంది. మ‌రోసారి భాగ‌మ‌తితో అది సాధ్య‌మైంది. సినిమాలో ప‌నిచేసిన ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్‌కు థాంక్స్‌`` అన్నారు.

 కలెక్షన్స్ అదుర్స్: దిల్ రాజు

కలెక్షన్స్ అదుర్స్: దిల్ రాజు

ఈ సినిమా వీకెండ్స్‌లో బాగా రన్ అయింది. అయితే సోమవారం రోజు ఎలా ఉంటుందో అని అందరిలాగే నేనూ వెయిటింగ్. అన్ని ఏరియాల్లో థియేటర్లు ఫుల్ అవ్వడంతో చాలా ఎగ్జైట్ అయ్యాను. సోమవారం రోజు అలా ఫుల్ అయిందంటే సినిమా ఏ రేంజికైనా వెలుతుందని చాలా సార్లు ప్రూవ్ అయింది అని దిల్ రాజు తెలిపారు.

అనుష్క చాలా కష్టపడింది

అనుష్క చాలా కష్టపడింది

‘ఈ సినిమాకు అనుష్క చాలా కష్టపడింది. అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, బాహుబలి చిత్రాలకు చిత్రాల‌కు అనుష్క ఎంత ఎఫ‌ర్ట్ పెట్టి ప‌నిచేసిందో ఈ సినిమాకు అంతే ఎఫ‌ర్ట్ పెట్టి ప‌ని చేసింది. సాధారణంగా అయితే హీరోలు మాత్రమే అలా చేస్తారు. ఒక హీరోయిన్ అయి ఉండి ఇంత కష్టపడ్డ అనుష్కకు హ్యాట్సాఫ్.... అని దిల్ రాజు ప్రశంసించారు.

అనుష్క లేక పోతే అంతే

అనుష్క లేక పోతే అంతే

ఒక సినిమా ఎవరైనా కథ రాయొచ్చు, ఎవరైనా తీయవచ్చు. కానీ సినిమాకు, అందులోని క్యారెక్టర్‌కు తగిన నటులు లేక పోతే మిస్ ఫైర్ అవుతుంది. ఈ సినిమాకు అనుష్కను ఎంచుకోవడం చాలా ప్లస్సయింది. ఆమెనే ఈ చిత్రానికి బ్యాక్ బోన్... అని దిల్ రాజు తెలిపారు.

 అశోక్ నమ్మకం నిజమైంది

అశోక్ నమ్మకం నిజమైంది

ఈ సినిమా పాయింట్‌ను న‌మ్మి అశోక్ ఇన్నేళ్లు ట్రావెల్ చేశాడు. అది ఈరోజు నిజ‌మైంది. తెలుగులో కాకుండా త‌మిళం, మ‌ల‌యాళంలో సినిమా మ్యాజిక్ చేసింది. కొత్త కాన్సెప్ట్ సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తామ‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి నిరూపించారు... అని దిల్ రాజు తెలిపారు.

 యూవి మా సొంత సంస్థ లాంటిదే

యూవి మా సొంత సంస్థ లాంటిదే

యూవి మా సొంత సంస్థ లాంటిదే. వంశీ, ప్ర‌మోద్‌, విక్కీల‌ను చూస్తుంటే న‌న్ను నేను చూసుకుంటున్న‌ట్లు ఉంది. ఎందుకంటే మా సంస్థ లాగే ఆరు సంవ‌త్స‌రాల్లో ఐదు హిట్స్ నేను కొట్టినట్లే, యు.వి.క్రియేష‌న్స్ ఆరు ఏళ్ల‌లో ఐదు హిట్స్ సాధించారు... అని దిల్ రాజు తెలిపారు.

 ఈ క్రెడిట్ వారికే

ఈ క్రెడిట్ వారికే

ఇది స‌క్సెస్‌మీట్ కాదు... స‌క్సెస్‌ఫుల్ ప్ర‌యాణం. 2012లో స్టార్ట్ చేసిన జ‌ర్నీ ఇది. అప్పుడు తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌ద‌ని ఈరోజు రుజువైంది. నాతో పాటు ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ అంద‌రూ కూడా న‌మ్మ‌కంగా ట్రావెల్ చేశారు. ముఖ్యంగా అనుష్క నా క‌థ‌ను న‌మ్మి, ఈ స‌క్సెస్ వ‌ర‌కు ట్రావెల్ చేసింది. ఆమెకు థాంక్స్‌. ఈ స‌క్సెస్ క్రెడిట్ అంతా అనుష్క, నిర్మాత‌ల‌కు చెందుతుంది`` అని దర్శకుడు వ్యాఖ్యానించారు.

English summary
Anushka Shetty has thanked the audience, media and team crew as her recent release Bhaagamathie film is faring well at the box-office. She heaped praise on Director Ashok and Music Director SS Thaman. Anushka said while doing the film she had witnessed excitement and frustration and added that it is totally worth it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu