అనుష్క "భాగమతి" మొదలైనట్టేనా..!?
అనుష్క ప్రధానపాత్రలో 'భాగమతి' పేరిట ఓ సినిమా తెరకెక్కబోతోందని అప్పట్లో ఇండస్ట్రి లో వచ్చిన టాక్.అయితే బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో సినిమాలతో బిజీగా ఉండడంతో భాగమతిని కాస్త పక్కన పెట్టింది అనుష్క. కానీఇటీవల విడుదలైన "రుద్రమదేవి" మరోసారి నటిగా అనుష్కకు బూస్ట్ ఇవ్వడంతో.. ఇప్పుడు "భాగమతి" చిత్రంలో నటించేందుకు సిద్దంగా వున్నాను అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట..

ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా అనుష్క కెరీర్ లో మరో అరుందతి అవుతుందంటున్నారు. భాగమతి అనగానే హైదరాబాద్ నిర్మాణం నాటి చరిత్ర గుర్తు రాక మానదు. అయితే ఈ భాగమతి ,ఆభాగమతి ఒకరేనా కాదాఅన్నది తెలియాల్సి ఉంది...


Click it and Unblock the Notifications











