»   » అల్లు అర్జున్ ని అడ్డం పెట్టి మళయాంలో రిలీజ్ : లోగో,టైటిల్ ఇదే

అల్లు అర్జున్ ని అడ్డం పెట్టి మళయాంలో రిలీజ్ : లోగో,టైటిల్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : స్టార్ హీరోయిన్ అనుష్క టైటిల్‌ రోల్‌లో గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో డైనమిక్‌ డైరెక్టర్‌ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి ద్విభాషా చిత్రం ‘రుద్రమదేవి'. ఈ చిత్రాన్ని మళయాళంలో రుద్ర టైటిల్ తో డబ్ చేసి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ కు మళయాళంలో ఉన్న క్రేజ్ తో ఓపినింగ్స్ బాగా వస్తాయని భావిస్తున్నారు. ది వారియర్ క్వీన్ అనే సబ్ టైటిల్ తో ఈ చిత్రం విడుదల అవుతుంది. ఈ మేరకు డిజైన్ చేసిన టైటిల్ లోగోని మీరు ఇక్కడ చూడవచ్చు.

అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రాన్ని జూన్‌ 26న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాత గుణశేఖర్‌.


ఈ సందర్భంగా దర్శకనిర్మాత గుణశేఖర్‌ మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం ఫైనల్‌ మిక్సింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల రీ-రికార్డింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇళయరాజాగారి నేతృత్వంలో సింఫనీ ఆర్కెస్ట్రాతో 25 రోజులపాటు లండన్‌లో ఈ రీ-రికార్డింగ్‌ కార్యక్రమాలు జరిగాయి. లండన్‌లో రీ-రికార్డింగ్‌ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ‘రుద్రమదేవి' కావడం విశేషం.


Anushka's Rudramadevi Malayalam Title & Logo

రుద్రమదేవిగా అనుష్క ఎంతో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. కథ పరంగా, నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌పరంగా, సాంకేతికపరంగా ఎంతో అత్యున్నతంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. జూన్‌ 26న ప్రపంచ వ్యాప్తంగా మా ‘రుద్రమదేవి' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో జూన్‌ 26న విడుదలవుతోంది. అలాగే మలయాళంలో కూడా జూన్‌ 26నే ఈ చిత్రం విడుదలవుతుంది'' అన్నారు.


రుద్రమదేవిగా అనుష్క నటించిన ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో గోనగన్నారెడ్డిగా స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌, రానా, కృష్ణంరాజు, సుమన్‌, ప్రకాష్‌రాజ్‌, నిత్యమీనన్‌, కేథరిన్‌, ప్రభ, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్య మీనన్‌, ప్రసాదాదిత్య, అజయ్‌, విజయ్‌కుమార్‌, వేణుమాధవ్‌, ఉత్తేజ్‌, వెన్నెల కిషోర్‌, కృష్ణభగవాన్‌, ఆహుతి ప్రసాద్‌, చలపతిరావు, శివాజీరాజా, సమ్మెట గాంధీ, ఆదితి చెంగప్ప, సన, రక్ష తదితర నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు.

English summary
Anushka's historical flick 'Rudramadevi' has been dubbed in Malayalam as 'Rudra' . Even the logo design has been unveiled and it comes with a tag line 'The Warrior Queen'.
Please Wait while comments are loading...