»   » కుళ్లు జోక్ లతో కాదు...( 'సైజ్‌ జీరో' ప్రివ్యూ)

కుళ్లు జోక్ లతో కాదు...( 'సైజ్‌ జీరో' ప్రివ్యూ)

Written By:
Subscribe to Filmibeat Telugu


హైదరాబాద్‌:బాహుబలి, రుద్రమదేవి వంటి హిట్ చిత్రాల తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంపై సాధారణంగా మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఆ రెండు చిత్రాల్లో ప్రభాస్, అల్లు అర్జున్ ఉన్నారు. ఇందులో ఆర్య ఉన్నా తెలుగుకి లేనట్లే. ఎందుకంటే ఆర్యకు ఇక్కడ క్రేజ్ లేదు కాబట్టి. దాంతో అనుష్కదే సోలోగా ఈ చిత్రం. భాక్సాఫీస్ వద్ద ఆమెకు ఉన్న క్రేజే...సినిమాకు ఓపినింగ్స్ తెచ్చే స్టామినా.

ఈ విషయాలు అర్దం చేసుకుందో ఏమో అనుష్క..కష్టపడి ఇరవై కేజీలు సహజ పద్దతుల్లో పెరిగింది. తన శక్తినంతటినీ పెట్టి ఈ సినిమాలో నటించింది. దానికి తోడు ఇప్పుడు సొసైటీలో ఉన్న సైజ్ జీరో ట్రైండ్ కూడా ఈ సినిమాపై ఆసక్తి పెంచేలా చేసింది. అయితే ఇవన్నీ కథ ఎంత బలంగా ఉంది అనేదానిపై ఆధారపడి వర్కవుట్ అయ్యే విషయాలు.

size zero

స్టోరీ లైన్.... ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయిని వారి కుటుంబం ఏ విధంగా ట్రీట్‌ చేస్తుంది. పెళ్లి వరకూ సన్నగా ఉండాలని నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంది అనేది క్లుప్తంగా చిత్ర కథాంశం.


అనుష్క మాట్లాడుతూ...లావున్న అమ్మాయి ప్రేమకథ అంటే.. లావుగా ఉన్న అమ్మాయిపై కుళ్లు జోకులతో నింపేయలేదు. అధిక బరువు ఉన్నంత మాత్రాన తక్కువగా చూడాల్సిన అవసరం లేదు అని చెప్పనున్నాం. అలాగని ఇదేదో మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సబ్జెక్ట్‌ కాదు. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారినీ అమితంగా ఆకట్టుకొనే చిత్రమిది అని చెప్పారామె.

మా కథా రచయిత అయిన కనికా థిల్లాన్‌ తనకు పరిచయమున్న ఒక కుటుంబంలోని ఓ అమ్మాయి నిజ జీవితం నుంచి స్ఫూర్తి పొంది 'సైజ్‌ జీరో' కథను సిద్ధం చేసింది. ఇటువంటి కథలు ఎక్కువ మంది జనాలకు చేరువయ్యేలా చేయాలంటే స్టార్‌ హీరోయిన్‌ అవసరం. అందుకోసమే నన్ను సంప్రదించారు. కథ బాగా నచ్చడంతో నేనూ సరేనన్నాను. తొలుత మేకప్‌తో కవర్‌ చేద్దామనుకొన్నాం. అయితే ఫొటోషూట్‌ చేసిన తర్వాత నా బాడీ క్యారెక్టర్‌కు సూట్‌ అవ్వలేదనిపించింది. అందుకే తర్వాత 17 కేజీలు పెరిగాను అని అన్నారు.

size2


నటీనటులు:అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం: యం.యం.కీరవాణి,
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా,
ఆర్ట్: ఆనంద్ సాయి,
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి,
కాస్ట్యూమ్స్: ప్రశాంత్,
కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం,
నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి,
దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి
విడుదల తేదీ: 27, నవంబర్ 2015.

English summary
After tasting two back to back blockbusters Baahubali and Rudhramadevi, Anushka Shetty is all set for her next Size Zero.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu