అనుష్క ‘వర్ణ’రిలీజ్ డేట్ ఖరారు
అలాగే ఆర్య, అనుష్క ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చెయ్యనున్నారు. తమిళ వెర్షన్ ఆడియో ఇప్పటికే విడుదలైంది. తెలుగు వెర్షన్ యొక్క ఆడియో అక్టోబర్ రెండో వారంలో విడుదలచెయ్యనున్నారు. ఒక కొత్త రకం ప్రేమకధ తో రొమాంటిక్ ఫాంటసీ రూపంలో చూపించనున్నారు. ఈ సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకుడు. ప్రసాద్ వి పోట్లురి పి.వి.పి బ్యానర్ పై నిర్మిస్తున్నారు. హరీశ్ జయరాజ్ సంగీత దర్శకుడు. నేపధ్య సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నాడు
అనుష్క మాట్లాడుతూ...''తొలి రోజుల్లో కెమెరా ముందు సరిగ్గా నటించడం వస్తే చాలనుకొనేదాన్ని. ఇప్పుడేమో అందరూ 'నువ్వు మంచి నటివి' అని చెబుతుంటారు. అలాంటి మాటలు విన్నప్పుడు ఒక రకమైన భావోద్వేగానికి గురవుతుంటా'' అని చెబుతోంది అనుష్క.
తొలి రోజుల్ని గుర్తుతెచ్చుకొన్నప్పుడు ఏమనిపిస్తుంటుందని అనుష్కని అడిగితే.... ''నమ్మశక్యంగా ఉండదు. కలల ప్రపంచంలో జీవిస్తున్నానా అనే సందేహం తలెత్తుతుంటుంది. అసలు సినిమా కెమెరా ఎలా ఉంటుందో కూడా తెలిసేది కాదు. అనుకోకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చాను. అవకాశాన్ని వృథా చేసుకోకూడదని సినిమాలు చేశాను. క్రమంగా ఆ సినిమానే అన్నీ నేర్పించింది. ఇప్పుడు గతాన్ని గుర్తుకు తెచ్చుకొంటే... ఇలా ఎలా మారిపోయానా అని అనిపిస్తుంటుంది.
ఆ క్షణం ఎంత సంతృప్తి పొందుతుంటానో మాటల్లో చెప్పలేను. అదే సమయంలో కాస్త భయం కూడా వేస్తుంటుంది... ఈ స్థాయి గుర్తింపు, గౌరవాన్నిచ్చిన ప్రేక్షకులపట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలనే విషయం గుర్తుకొచ్చి'' అని చెప్పుకొచ్చింది అనుష్క. ఆమె త్వరలోనే 'వర్ణ' అనే చిత్రంతో తెరపై సందడి చేయబోతోంది. ప్రస్తుతం 'రుద్రమదేవి', 'బాహుబలి' చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications












