»   » అనుష్క విశ్వరూపం ('వర్ణ' ప్రివ్యూ)

అనుష్క విశ్వరూపం ('వర్ణ' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'వర్ణ'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి శ్రీరాఘవ దర్శకుడు. ఆర్య ప్రధాన పాత్రలో నటించారు. ప్రసాద్‌.వి.పొట్లూరి నిర్మాత. పరమ్‌.వి.పొట్లూరి సమర్పకులు. ఈ రోజు భారి ఎత్తున అంతటా విడుదల అవుతోంది. తెలుగులో 1200 థియోటర్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రం హైలెట్ ...ఒకే తెరపై రెండు వేర్వేరు లోకాల్ని ఆవిష్కరించటమే అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో అనుష్క విశ్వరూపం చూడవచ్చునని టాక్.


ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేసింది. ఒక పాత్రలో ఆమె సాధారణ గృహిణిగా, ఒక పాత్రలో ట్రైబల్ ఉమన్(ఆటవిక యువతి)గా కనిపించనుంది. జార్జియా అడవుల్లో అనుష్కపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో పోషిస్తోన్న విలక్షణమైన పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. అరుంధతి తర్వాత అనుష్కకు ఈచిత్రం బాగా పేరు తెస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

'వర్ణ' గురించి అనుష్క మాట్లాడుతూ...నా పాత్ర గురించి చెబితే ఉత్కంఠ తొలగిపోతుంది. గతంలో నేను పోషించని పాత్ర. చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా స్క్రిప్టును దర్శకులు సెల్వరాఘవన్‌ చెప్పేటప్పుడే నటించాలనే ఆత్రుత పుట్టింది. ఆ తర్వాత ఆయా సన్నివేశాలు చేసేటప్పుడు మధురానుభూతికి లోనయ్యాను. రెండేళ్లపాటు ఇందులో నటించానంటే.. ఎంత మంచి సినిమాయో మీకే అర్థమవుతుంది అంది.


అలాగే... ఇదో అద్భుత విజువల్ ట్రీట్. ఫాంటసీ కథాంశంతో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం. దర్శకుడు సెల్వరాఘవన్ కథ చెప్పినప్పుడే చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యాను. ఈ కథను తెర పై ఆవిష్కరించడం సాధ్యమా? అన్న సందేహం కలిగింది. దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా సెల్యులాడ్‌పై ఆవిష్కరించారు. వర్ణ చిత్రంలో నటించడం కొత్త అనుభవం అన్నారు. అలాగే...ఎవరైనా కొత్త కాన్సెప్ట్‌తో కూడిన చిత్రాలు చేయడానికి ఎవరైనా ఎగ్జైట్‌గా ఫీలవుతారు. మేమూ ఈ చిత్రాన్ని ఇష్టపడి చేశాం. యూనిట్ అంతా హార్డ్ వర్కు చేశాం. చిత్రంలో ఎమోషనల్ సన్నివేశాలు సూపర్‌గా వచ్చాయి.

దర్శకుడు మాట్లాడుతూ ''ఒకే తెరపై రెండు వేర్వేరు లోకాల్ని ఆవిష్కరించబోతున్నాం. రెండు లోకాల మధ్య సంబంధమేమిటి... అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అనుష్క, ఆర్యల పాత్ర చిత్రణలు కొత్తగా ఉంటాయి. విజువల్‌ గ్రాఫిక్స్‌ ప్రధానాంశంగా తెరకెక్కిన విభిన్నమైన చిత్రమిది'' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక అద్భుతమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ప్రసిద్ధిగాంచిన బుడాపెస్ట్‌ స్టూడియోలో రీరికార్డింగ్‌ జరిపాం. హారీస్‌ జైరాజ్‌ అందించిన పాటలకి మంచి స్పందన వస్తోంది. అనిరుథ్‌ నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. భారతీయ తెరపై వస్తోన్న ఓ అద్భుత చిత్రంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

బ్యానరు: పీవీపీ సినిమా
నటీనటులు: ఆర్య,అనుష్క మిగతా పాత్రల్లో తమిళ నటులు.
ఛాయాగ్రహణం: రామ్‌జీ,
సంగీతం: హారిస్‌ జైరాజ్
పాటలు: చంద్రబోస్
నేపధ్య సంగీతం: అనిరుధ్‌
ఎడిటింగ్: కోలా భాస్కర్
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీ రాఘవ

English summary
Varna is dubbed version of Tamil movie Irandam Ulagam, it is an romantic fantasy movie. In which, Arya and Anushka Shetty playing the main lead roles. Aadavari Matalaku Ardhalu Verule movie fame director Sri Raghava directing this movie under PVP Cinema banner. The music is composed by Harris Jayaraj and cinematography is handled by Ramji. PVP Cinema, the production house behind this magnum opus, will release in Telugu and Tamil in about 1200 theatres.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu