»   »  అనుష్క 'వర్ణ' చిత్రం హైలెట్ అదే

అనుష్క 'వర్ణ' చిత్రం హైలెట్ అదే

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'వర్ణ'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి శ్రీరాఘవ దర్శకుడు. ఆర్య ప్రధాన పాత్రలో నటించారు. ప్రసాద్‌.వి.పొట్లూరి నిర్మాత. పరమ్‌.వి.పొట్లూరి సమర్పకులు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 22న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వర్ణ చూసిన సెన్సార్ మెంబర్స్...కంటెంట్,గ్రాండియర్ గా విజువల్స్ చూసి చాలా మెచ్చుకుని ఒక్క కట్ కూడా చెప్పలేదన్నారు. తెలుగులో 1200 థియోటర్స్ లో విడుదల కానుంది. ఈ చిత్రం హైలెట్ ...ఒకే తెరపై రెండు వేర్వేరు లోకాల్ని ఆవిష్కరించటమే అని చెప్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''ఒకే తెరపై రెండు వేర్వేరు లోకాల్ని ఆవిష్కరించబోతున్నాం. రెండు లోకాల మధ్య సంబంధమేమిటి... అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అనుష్క, ఆర్యల పాత్ర చిత్రణలు కొత్తగా ఉంటాయి. విజువల్‌ గ్రాఫిక్స్‌ ప్రధానాంశంగా తెరకెక్కిన విభిన్నమైన చిత్రమిది'' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక అద్భుతమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ప్రసిద్ధిగాంచిన బుడాపెస్ట్‌ స్టూడియోలో రీరికార్డింగ్‌ జరిపాం. హారీస్‌ జైరాజ్‌ అందించిన పాటలకి మంచి స్పందన వస్తోంది. అనిరుథ్‌ నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. భారతీయ తెరపై వస్తోన్న ఓ అద్భుత చిత్రంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.


వర్ణ చిత్ర విశేషాల గురించి అనుష్క చెప్తూ...ఇదో అద్భుత విజువల్ ట్రీట్. ఫాంటసీ కథాంశంతో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం. దర్శకుడు సెల్వరాఘవన్ కథ చెప్పినప్పుడే చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యాను. ఈ కథను తెర పై ఆవిష్కరించడం సాధ్యమా? అన్న సందేహం కలిగింది. దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా సెల్యులాడ్‌పై ఆవిష్కరించారు. వర్ణ చిత్రంలో నటించడం కొత్త అనుభవం అన్నారు. అలాగే...ఎవరైనా కొత్త కాన్సెప్ట్‌తో కూడిన చిత్రాలు చేయడానికి ఎవరైనా ఎగ్జైట్‌గా ఫీలవుతారు. మేమూ ఈ చిత్రాన్ని ఇష్టపడి చేశాం. యూనిట్ అంతా హార్డ్ వర్కు చేశాం. చిత్రంలో ఎమోషనల్ సన్నివేశాలు సూపర్‌గా వచ్చాయి. ఇక్కడ హీరో ఓరియంటెడ్? హీరోయిన్ ఓరియంటెడ్ కథ అన్నది ముఖ్యం కాదు. ఏ చిత్రానికైనా స్క్రిప్టు ముఖ్యం. మంచి కథ అని పిస్తే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధమే అన్నారు..

అంతర్జాతీయ స్థాయిలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయిదు విదేశీ భాషల్లో తెరపైకి రానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. పీవీపీ బ్యానరుపై తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్‌కు వెళ్లొచ్చింది. అక్కడ 'యు' ధ్రువపత్రం లభించింది. అంతేకాదు... చిత్ర యూనిట్‌ను అభినందించిందట సెన్సార్‌బోర్డు. ఈ సినిమాకు సంగీతం హ్యారీస్‌ జయరాజ్‌, నేపథ్య సంగీతం అనిరుధ్‌ సమకూర్చారు. ఇందులో వాస్తవానికి అద్దం పట్టేలా పలు గ్రాఫిక్‌ సన్నివేశాలు ఉన్నాయని, అవి బాగా ఆకట్టుకుంటాయమని చిత్రవర్గాలు తెలిపాయి.


ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేసింది. ఒక పాత్రలో ఆమె సాధారణ గృహిణిగా, ఒక పాత్రలో ట్రైబల్ ఉమన్(ఆటవిక యువతి)గా కనిపించనుంది. జార్జియా అడవుల్లో అనుష్కపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో పోషిస్తోన్న విలక్షణమైన పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. అరుంధతి తర్వాత అనుష్కకు ఈచిత్రం బాగా పేరు తెస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రామ్‌జీ, సంగీతం: హారిస్‌ జైరాజ్‌.

English summary
Anushka Shetty starrer Varna was cleared by Censor Board with a clean U certificate. No cuts were suggested. The members who watched Varna were highly appreciative of the content and praised the visual grandeur and the effort that went into this production. PVP Cinema, the production house behind this magnum opus, will release in Telugu and Tamil in about 1200 theatres.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu