»   » అయిదు విదేశీ భాషల్లో అనుష్క చిత్రం

అయిదు విదేశీ భాషల్లో అనుష్క చిత్రం

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : దర్శకుడు సెల్వరాఘవన్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన చిత్రం వర్ణ( 'ఇరండాం ఉలగం'). ఆర్య, అనుష్క జంటగా నటించారు. తొలుత ఈ కథకు తన తమ్ముడు ధనుష్‌ను ఎంచుకున్నారు సెల్వరాఘవన్‌. ఆయనతో ఫొటోషూట్‌, కొన్ని సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేశారు కూడా. చివరకు ఆ స్థానంలోకి ఆర్య వచ్చారు. అనుకున్నట్లుగానే సెల్వరాఘవన్‌ భారీగా దీన్ని రూపొందించారు.

  అంతర్జాతీయ స్థాయిలో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయిదు విదేశీ భాషల్లో తెరపైకి రానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. పీవీపీ బ్యానరుపై తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్‌కు వెళ్లొచ్చింది. అక్కడ 'యు' ధ్రువపత్రం లభించింది. అంతేకాదు... చిత్ర యూనిట్‌ను అభినందించిందట సెన్సార్‌బోర్డు. ఈ సినిమాకు సంగీతం హ్యారీస్‌ జయరాజ్‌, నేపథ్య సంగీతం అనిరుధ్‌ సమకూర్చారు. ఇందులో వాస్తవానికి అద్దం పట్టేలా పలు గ్రాఫిక్‌ సన్నివేశాలు ఉన్నాయని, అవి బాగా ఆకట్టుకుంటాయమని చిత్రవర్గాలు తెలిపాయి.


  అనుష్క వీరనారిగా నటించిన మరో చిత్రం 'వర్ణ'. తెలుగులో హీరోయిన్ అనుష్కకు ఉన్న ఫాలోయింగ్, స్టార్ స్టాటస్ ఏమిటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని పాపులారిటీ. 'అరుంధతి' చిత్రం తర్వాత అనుష్క దశ తిరిగింది. తాజాగా బాహుబలి, రుద్రమదేవి లాంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది. వీరనారి పాత్రలకు అనుష్కకు ఎవరూ ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. యుగానికి ఒక్కడు లాంటి హిట్ చిత్రాలకు తెరకెక్కించిన సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈచిత్రం కావటంతో ఇక్కడ కూడా మరింత క్రేజ్ ఏర్పడింది.

  ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేసింది. ఒక పాత్రలో ఆమె సాధారణ గృహిణిగా, ఒక పాత్రలో ట్రైబల్ ఉమన్(ఆటవిక యువతి)గా కనిపించనుంది. జార్జియా అడవుల్లో అనుష్కపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో పోషిస్తోన్న విలక్షణమైన పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. అరుంధతి తర్వాత అనుష్కకు ఈచిత్రం బాగా పేరు తెస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రామ్‌జీ, సంగీతం: హారిస్‌ జైరాజ్‌.

  English summary
  Visual effects were given prime importance in 'varna' film. Anushka has played double roles as a home maker and as a tribal lady. We can watch her sword fighting skills in this movie. She also learnt martial arts for this movie. Hero Arya will be seen in the other lead role of this film. Harris Jairaj has scored the music of the film. Selva Raghavan, who earlier directed 'Yuganikokkadu', is directing this movie. Prasad V.Potluri is producing this movie on PVP Cinemas.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more