»   » కలాం పేరు తప్పుగా ట్వీట్‌ చేసి,విమర్శలు పాలైంది

కలాం పేరు తప్పుగా ట్వీట్‌ చేసి,విమర్శలు పాలైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మృతికి సెలబ్రెటీలు అంతా సంతాపం తెలిపిన సంగతి తెలిసిందే. అదే కోవలం సంతాపం తెలుపుదామనుకున్న బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ విమర్శల పాలైంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పేరు తప్పుగా ట్వీట్‌ చేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విమర్శల వర్షం కురిపించారు. ఆమె ఏం ట్వీట్ చేసిందంటే...

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సోమవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయనకు మంగళవారం ట్విట్టర్‌లో నివాళులర్పిస్తూ అనుష్కశర్మ ఆయన పేరును ఏపీజే అబ్దుల్‌ కలాంకి బదులుగా ఏబీజే కలాం ఆజాద్‌గా పేర్కొంది. వెంటనే తన తప్పును తెలుసుకున్న అనుష్క ఆ ట్వీట్‌ని తొలగించి.. మరో ట్వీట్‌ చేసింది.

Anushka Sharma gets APJ Abdul Kalam’s name wrong in tribute, not once but twice

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అందులోనూ కలాం పేరు తప్పుగానే రాసింది. అనంతరం ఆ ట్వీట్‌ని కూడా తొలగించి, మూడోసారి కలాం పేరు సరిగా రాస్తూ నివాళులర్పించింది. అప్పటికే అనుష్క... రెండు సార్లు తప్పుగా రాయడంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anushka Sharma gets APJ Abdul Kalam’s name wrong in tribute, not once but twice

కనీసం మూడోసారికైనా సరిగా రాశావు సంతోషం అంటూ ఒకరు, మూడోసారైనా సరిగా రాసి.. ట్వీట్‌ని తొలగించవని అనుకుంటున్నా.. అని మరొకరు అలా ఆమె ట్వీట్లపై విమర్శలు గుప్పించారు. ఫైనల్ గా ఇలా ట్వీట్ చేసింది.

English summary
Bollywood actress Anushka Sharma on Tuesday (July 28) came into focus on social media when she got the spellings of former president APJ Abdul Kalam wrong while expressing condolences on his demise.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu