»   »  కాలికి రక్తం, భయంకరంగా అనుష్క: ఇంతకీ "పరి" కథేంటి?

కాలికి రక్తం, భయంకరంగా అనుష్క: ఇంతకీ "పరి" కథేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ హీరోయిన్‌గా గ్లామరస్‌ లుక్‌లో కనిపించడమే కాదు. నిర్మాతగా సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలను నిర్మించింది అనుష్క.క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ బ్యానర్ పై చేసిన ణ్ 10 మంచి విజయం పొందింది. కాకపోతే క్రిటిక్స్ మెచ్చేసుకున్నా కూడా డబ్బులు మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తరువాత పంజాబ్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఫిల్లౌరి కూడా నష్టం లేకుండా భారీ లాభాలు రాకుండా బాగానే ఆడింది. ఇంతవరకూ రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ, ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. "పరి" అనే సినిమాని నిర్మిస్తోంది.

పరి

పరి

కొన్నాళ్ళ కిందటే అనుష్క "పరి" ఫస్ట్‌లుక్‌ను ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది.ఈ పోస్టర్ లో ఆమె లుక్ డిఫరెంట్ గా .. భయాన్ని కలిగించేలా వుంది. ఆమె ఈ సినిమాలో దెయ్యంగా కనిపించి భయపెట్టబోతోందని కొంతమంది అంటే, మానసిక రోగిగా కనిపించనుందని మరికొంత మంది అన్నారు. అసలు విషయం మాత్రం ఎవరికీ పెద్దగా తెలియలేదు.

ఎవరో దాడి చేసినట్లు

ఎవరో దాడి చేసినట్లు

ఇప్పుడు మళ్ళీ ఓ పోస్టర్‌ను తాజాగా అనుష్క తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మొబైల్‌కు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్న అనుష్కపై ఎవరో దాడి చేసినట్లు.. ఆ దాడిలో ఆమె గాయపడి దీనస్థితిలో ఉన్నట్లు ఆ పోస్టర్‌లో కనిపిస్తోంది. అంతేకాకుండా ఆమె కుడి కాలికి గాయమై రక్తం కారుతున్నట్లు కూడా అందులో ఉంది.

ఫిబ్ర‌వ‌రి 9 న

వ‌చ్చే సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 9 న పరి మూవీ రిలీజ్ అవ‌నుంద‌ట‌. పరి మూవీ ఫ‌స్ట్ పోస్ట‌ర్ ను కూడా అనుష్కే త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ లో అనుష్క నటించ‌డ‌మే కాదు.. ఈ మూవీ ప్రొడ్యూస‌ర్ కూడా త‌నే. ఇంత‌కు ముందు ఎన్ హెచ్ 10, ఫిల్లౌరి మూవీ ల‌కు ప్రొడ్యూస‌ర్ గా ఉంది అనుష్క‌.

జ‌బ్ హారీ మెట్ సెజ‌ల్

జ‌బ్ హారీ మెట్ సెజ‌ల్

ఇక అనుష్క‌ షారూఖ్ ఖాన్ తో న‌టిస్తున్న జ‌బ్ హారీ మెట్ సెజ‌ల్ మూవీ ఆగ‌స్ట్ 4 న రిలీజ్ అవనుంది. షారుఖ్ మరుగుజ్జు గా న‌టిస్తున్న మ‌రో మూవీలోనూ న‌టిస్తున్న‌ది అనుష్క‌. ఆ మూవీలో కత్రినా కూడా ఓ రోల్ లో న‌టిస్తున్న‌ది. సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ లోనూ ఓ చిన్న పాత్ర చేస్తున్న‌ది అనుష్క‌.

English summary
Anushka Sharma’s intriguing avatar will meet you at the theatres on February 9 next year
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu