»   » నువ్వు నన్ను అసభ్యంగా తాకావ్, జాక్వెలిన్‌ని కూడా వేధించావట...మొహమ్మీదే చెప్పింది

నువ్వు నన్ను అసభ్యంగా తాకావ్, జాక్వెలిన్‌ని కూడా వేధించావట...మొహమ్మీదే చెప్పింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాఫీ విత్ కరణ్ ఇప్పుడు బాలీవుడ్ లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అత్యంత పాపులారిటీ ఉన్న షో టీఆర్పీ పరంగానే కాదు బాలీవుడ్ లో ఉన్న స్టార్ల పర్సనల్ విషయాలలో వివాదాస్పద అంశాలని బయటికి తేవటం లో కూడా ఈ షో బాగానే పాపులర్ అయ్యింది. ప్రతీ షోలోనూ మితిమీరిన ఉత్సాహం తో వింత ప్రశలని అడిగే కరణ్ ఈ సారి మాత్రం తానే ఇరుక్కున్నాడు. ఎప్పటి మాదిరిగానే ఎదేదో అడిగి ఇంకేద్దో చెప్పిద్దాం అనుకున్న కరణ్ తానే ఇరుక్కున్నాడు. అనుష్క శర్మ ని కెలకబోయి ఆమె రిటార్ట్ కి సిగ్గుపడాల్సి వచ్చింది.

Anushka Sharma say Karan Johar sexually harasses people

కొన్ని రోజుల కిందట తనకు అనుష్క శర్మ మీద మాత్రం సరైన అభిప్రాయం లేదని.. ఆ అమ్మాయికి అంత పెద్ద సంస్థలో అవకాశం దక్కడం నచ్చలేదని, 'రబ్ నే బనాదె జోడీ" సినిమా నుంచి అనుష్కను తప్పించడానికి అప్పట్లో చాలానే ప్రయత్నించానంటూ షాకింగ్ విషయం వెల్లడించాడు కరణ్. "ఎందుకో కానీ నాకు అనుష్కను చూసినపుడు సరైన అభిప్రాయం కలగలేదు. ఆమెకు ఆదిత్య చోప్రా 'రబ్ నె బనాదె జోడీ" లాంటి పెద్ద సినిమాలో ఛాన్సివ్వడం నచ్చలేదు. అందుకే ఆమె వద్దని గట్టిగా చెప్పాను. ఇంకెవరైనా ప్రముఖ హీరోయిన్ని తీసుకోమన్నాను. కానీ ఆదిత్య నా మాట వినలేదు. ఆమెతోనే సినిమా చేశాడు. ఐతే ఆ సినిమాలో.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో అనుష్క నటన చూశాక నా అభిప్రాయం మారింది. ఆమె టాలెంటేంటో నాకు అర్థమైంది. ఆమె కెరీర్ను నాశనం చేయాలనుకున్నందుకు చాలా బాధపడ్డాను. ఇప్పుడు 'యే దిల్ హై ముష్కిల్" సినిమాకు నేనే అనుష్కకు ఛాన్సిచ్చాను. ఆమె టాలెంట్ స్వయంగా చూశాను"" అని ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చెప్పిన కారణ్ ఈసారి మాత్రం అనుష్క కొట్టిన పక్కా పంచ్ కి ఒక్కసారి కంగుతిన్నాడు.

Anushka Sharma say Karan Johar sexually harasses people

ఇటీవల అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌తో కలిసి షో నిర్వహించాడు. ఈ షోలో అనుష్క శర్మ పెద్ద షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. కరణ్‌ తాజాగా తెరకెక్కించిన 'యే దిల్‌ హై ముష్కిల్‌' (ఏడీహెచ్‌ఎం) సినిమా షూటింగ్‌ సందర్భంగా తనను కొన్నిసార్లు అభ్యంతరకరంగా తాకాడని తెలిపింది.,,అంతకుముందు కరణ్‌ మాట్లాడుతూ ఏడీహెచ్‌ఎం షూటింగ్‌ సందర్భంగా తనకు అనుష్కపై ప్రేమ పుట్టిందని పేర్కొంటూ.. 'నేను నీకు పూర్తిగా పడిపోయాను. నీ కోసం ఆ సినిమా చేశాను' అంటూ పేర్కొన్నాడు. ఎంతో ఓపిగ్గా ఇదంతా విన్న అనుష్క ఒకింత అసహనంగా.. 'నేను అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టాలి. కొన్నిసార్లు అతను నన్ను అభ్యంతరకరంగా తాకాడు' అని పేర్కొంది. దీనికి కత్రిన స్పందిస్తూ 'నీలో కొంత చురుకుదనం తేవడానికి అలా చేసి ఉంటాడు' అని పేర్కొనగా.. అనుష్క మాత్రం వెనుకకు తగ్గలేదు. 'జాక్వలిన్‌ కూడా నీపై ఫిర్యాదు చేసింది. మనీష్‌ మల్హోత్రా పార్టీలో నువ్వు ఆమెను అసభ్యంగా తాకావంట' అని పేర్కొంది. దీంతో కత్రిన జోక్యం చేసుకొని ఈ 'లీగల్‌' తగాదాను ఇక్కడితో ముగించాలని వేడుకొంది. ఇదంతా వీరు సరదా కోసమే చేశారా? లేక నిజంగా ఏదైనా జరిగిందా? అన్నది దేవుడికే తెలియాలి అంటున్నారు బాలీవుడ్‌ జనాలు.

English summary
“While shooting Ae Dil Hai Mushkil, Karan did touch me pretty inappropriately numerous times”, commented the Sultan actress. Further adding, “Even Jacqueline Fernandez too has talked about Karan’s touch”. While the jesting banter did elicit more laughs than imagined we just wonder if the comments may be picked up in a wrong way
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu