»   » కొత్త సినిమాల్ని ఒప్పుకొని.. నాపై ఒత్తిడి పెంచుకోలేను

కొత్త సినిమాల్ని ఒప్పుకొని.. నాపై ఒత్తిడి పెంచుకోలేను

Posted By:
Subscribe to Filmibeat Telugu
Anushka
హైదరాబాద్ : తెలుగులో అంచెలెంచలుగా ఎదిగిన అనుష్క ఇప్పుడు రూ.50 కోట్ల హీరోయిన్. తెలుగులో భారీ ప్రాజెక్టులు అనదగ్గ 'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. మరో భారీ వెంచర్ 'వర్ణ' ముగింపు దశకు చేరుకొంది. వరసగా సినిమాలు ఒప్పుకుంటూ కంటిన్యూ షెడ్యూల్స్ తో ఆమె చాలా బిజీగా ఉంటోంది. అయితే 'బాహుబలి', 'రుద్రమ దేవి' వల్ల కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు. కొంతమంది దర్శక నిర్మాతలు సంప్రదించినా సున్నితంగా తిరస్కరిస్తోంది.


అనుష్క మాట్లాడుతూ... ''ప్రస్తుతం ఈ రెండు సినిమాలపైనే దృష్టి పెట్టా. నా కెరీర్‌లో చాలా కీలకమైన దశలో ఉన్నా. ఇప్పుడు కొత్త సినిమాల్ని ఒప్పుకొని.. నాపై ఒత్తిడి పెంచుకోలేను.నా కాల్షీట్లు కావాలంటే వచ్చే వేసవి వరకూ ఆగండి'' అంటోంది. దాంతో ఆమెతో సినిమాలు ప్రారంభిద్దామనుకున్న దర్శక,నిర్మాతలు డీలా పడ్డారు. అయితే మరికొంతమంది వచ్చే వేసవి నుంచే డేట్స్ ఇవ్వమని ఇప్పటి నుంచే వెంటబడుతున్నారు.


అయితే రుద్రమదేవి, బాహుబలి చిత్రాలు షూటింగ్ పూర్తి అయ్యేవరకు బ్రేక్ అనేది ఉండదని చెప్పింది. బహుశ ఆ చిత్రాలు వచ్చే ఏడాది మొదట్లో విడుదల కావచ్చని చెప్పింది. అప్పుడు కానీ తనకు కాస్త విరామం దొరుకుంది, ఆ సమయంలో కొత్త చిత్రాలలో నటించేందుకు ఆలోచిస్తానని అనుష్క తెలిపింది. అయితే ఈ ఏడాది మొదట్లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'వర్ణ' విడుదల కోసం ఎదురుస్తున్నట్లు చెప్పింది. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం తెలుగు, తమిళంలో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.

అలాగే ''తొలి రోజుల్ని గుర్తు చేసుకుంటే నమ్మశక్యంగా ఉండదు. కలల ప్రపంచంలో జీవిస్తున్నానా అనే సందేహం తలెత్తుతుంటుంది. అసలు సినిమా కెమెరా ఎలా ఉంటుందో కూడా తెలిసేది కాదు. అనుకోకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చాను. అవకాశాన్ని వృథా చేసుకోకూడదని సినిమాలు చేశాను. క్రమంగా ఆ సినిమానే అన్నీ నేర్పించింది. ఇప్పుడు గతాన్ని గుర్తుకు తెచ్చుకొంటే... ఇలా ఎలా మారిపోయానా అని అనిపిస్తుంటుంది. ఆ క్షణం ఎంత సంతృప్తి పొందుతుంటానో మాటల్లో చెప్పలేను. అదే సమయంలో కాస్త భయం కూడా వేస్తుంటుంది... ఈ స్థాయి గుర్తింపు, గౌరవాన్నిచ్చిన ప్రేక్షకులపట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలనే విషయం గుర్తుకొచ్చి'' అని చెప్పుకొచ్చింది అనుష్క. ఆమె త్వరలోనే 'వర్ణ' అనే చిత్రంతో తెరపై సందడి చేయబోతోంది. ప్రస్తుతం 'రుద్రమదేవి', 'బాహుబలి' చిత్రాల్లో నటిస్తోంది.

English summary
Anushka Shetty is shooting for "Rudhramadevi" and "Baahubali" simultaneously. Both films are expected to release next year. "She has been extremely busy with both the projects. Since both are very important projects, she is giving it as much time as possible. I don't think she will sign any new film at least for the next six months because she really doesn't have the time for a new project," the source close to Anushka
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu