»   » అనుష్కకు చేదు అనుభవం.. పొల్లాచీలో చుక్కలు చూపించిన..

అనుష్కకు చేదు అనుభవం.. పొల్లాచీలో చుక్కలు చూపించిన..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి చిత్రం తర్వాత అందాల తార అనుష్కశెట్టికి దక్షిణాదిలోనే కాదు.. దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఎక్కడికెళ్లినా అభిమానుల ఆదరణలో తడిసిముద్దవుతన్నది. కానీ తాజాగా తమిళనాడులో అనుష్కశెట్టికి చేదు అనుభవం ఎదురైంది. అయితే ఈ విషయంపై ఇంకా అనుష్క నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఇంతకు అక్కడ అనుష్కకు ఏమి జరిగిందంటే..

తమిళనాడులో భాగమతి షూటింగ్

తమిళనాడులో భాగమతి షూటింగ్

బాహుబలి తర్వాత అనుష్క నటిస్తున్న భాగమతి షూటింగ్ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఈ సినిమా షూటింగ్ కోసం పొల్లాచికి వెళ్లిన ఈ జేజమ్మకు స్థానిక రవాణాశాఖ అధికారులు చుక్కలు చూపించారు. డ్రైవర్ వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో కార్‌వాన్‌ను అధికారులు సీజ్ చేశారు.

సరైన పత్రాలు లేవు..

సరైన పత్రాలు లేవు..

వాహన తనిఖీల్లో భాగంగా అనుష్క ప్రయాణిస్తున్న కార్‌వాన్‌ను పరిశీలించాం. రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యాన్‌ను ఉపయోగిస్తున్నారు. అందుకే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నామని రవాణాశాఖ సిబ్బంది వెల్లడించినట్టు సమాచారం.

అనేక సందేహాలు

అనేక సందేహాలు

తనిఖీలో భాగంగా డ్రైవర్ వద్ద ఎలాంటి పత్రాలు లేవట. వాటి గురించి ఆరా తీయగా డ్రైవర్ చెప్పిన సమాధానాలు రవాణాశాఖ సిబ్బందికి పలు సందేహాలు తలెత్తాయట. దాంతో ఆ వాహనాన్ని సీజ్ చేసి స్వాధీనం చేసుకొన్నారట. ఆ తర్వాత చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన వాహనంలో అనుష్క వెళ్లినట్టు తెలుస్తున్నది.

బాహుబలి తర్వాత..

బాహుబలి తర్వాత..

‘బాహుబలి2' తర్వా అనుష్క తెలుగులో భాగమతి అనే చిత్రంలో నటిస్తున్నది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి తర్వాత అనుష్క మరోసారి చారిత్రక నేపథ్యమున్న పాత్రలో కనిపించనున్నది. ఈ చిత్రంలో అనుష్క కథానాయికకు ప్రాధాన్యం ఉన్న పాత్రను దక్కించుకొన్నది. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పిల్లా జమీందార్ ఫేం జీ అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరో పిరియాడిక్ స్టోరీలో..

మరో పిరియాడిక్ స్టోరీలో..

నిజాం యువరాణి భాగమతి ప్రణయగాథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిదని, అనుష్క టైటిల్ రోల్‌ను పోషిస్తుందని, పీరియాడిక్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న సినిమాలో టబు, ఆది పినిసెట్టి, ఉన్ని ముకుందన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

English summary
After Baahubali, Anushka Shetty's latest movie is Bhagamati. This move shoot is going at Pollachi of Tamilnadu. Local transport officials are seized Anushka's Carvan due to lack of proper papers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu