జపాన్ భాషలో బాహుబలి2.. అనుష్క ఎమోషనల్ వీడియో
Recommended Video

ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన బాహుబలి2 చిత్రం జపాన్‌లో రిలీజ్‌కు గ్రాండ్‌గా రిలీజైంది. జపాన్‌లో భారతీయ చిత్రాలకు ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రజనీకాంత్ చిత్రాలకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరంధం పడుతారు. ఇలాంటి నేపథ్యంలో విడుదలవుతున్న బాహుబలి2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఫేస్‌బుక్‌లో అనుష్క శెట్టి
డిసెంబర్ 29న బాహుబలి2 జపాన్‌లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర ప్రమోషన్‌ను వేగవంతం చేశారు. సినిమాలో నటించిన పాత్రధారులతో ప్రమోషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ చిత్రంలో దేవసేన పాత్ర పోషించిన అనుష్కశెట్టి ఫేస్‌బుక్‌లో స్పందించారు.

సోషల్ మీడియాలో జపాన్ ట్రైలర్
జపాన్ భాషలో రూపొందించిన బాహుబలి2 ట్రైలర్ పోస్ట్ చేసి తన కామెంట్స్‌ను పెట్టింది. వీడియోలో రూపంలో ఉన్న తన ప్రసంగాన్ని కూడా అందులో చేర్చింది. బాహుబలి1 చిత్రాన్ని ఆదరించిన జపాన్ ప్రేక్షకులకు థ్యాంక్స్. మీ ఆదరణను పొందడానికి బాహుబలి2 వస్తున్నది. మీరు థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసి గొప్ప అనూభూతి పొందాలని కోరుకొంటున్నాను. అని అనుష్క వీడియోలో వెల్లడించింది.

జపాన్ భాషలోకి బాహుబలి2
ప్రభాస్, రానా దగ్గుబాటి నటించిన బాహుబలి చిత్రాలు తెలగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లోకి అనువాదం చేశారు. ప్రపంచవ్యాప్తంగా బాహుబలికి క్రేజ్ లభించినందున ఈ చిత్రాన్ని జపాన్ భాషలో అనువాదం చేసి రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకొన్నారు.

జపాన్ భాషలో సెన్సార్
జపాన్ భాషలోకి అనువాదం చేసిన బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రానికి జీ సర్టిఫికెట్ లభించింది. అక్కడ జీ సర్టిఫికెట్ భారత్‌లో యూ సర్టిఫికెట్‌కు సమానం. రజనీకాంత్ చిత్రాలకు ధీటుగా బాహుబలి2 కలెక్షన్లు సాధిస్తుందా అనేది త్వరలోనే తెలియడం ఖాయం.


Click it and Unblock the Notifications











