»   » ప్రభాస్‌కు అనుష్క ఇంకా నో చెప్పలేదట.. క్లీన్ షేవ్ అందుకోసమేనట..

ప్రభాస్‌కు అనుష్క ఇంకా నో చెప్పలేదట.. క్లీన్ షేవ్ అందుకోసమేనట..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించబోయే చిత్రం సాహో. ఐదేళ్ల కఠోర శ్రమ తర్వాత ప్రభాస్ అమెరికాలో విశ్రాంతి తీసుకొన్ని ఇటీవల హైదరాబాద్‌కు చేరుకొన్నారు. ఈ నెలలోనే సాహో చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నది. ఈ చిత్రం కోసం బాలీవుడ్ విలన్ కమ్ హీరో నీల్ నితీష్ ముఖేష్‌ను విలన్‌గా తీసుకొన్నారు. బాలీవుడ్ హీరోయిన్ల కోసం వేట చేపట్టిన నిర్మాతలు ఏటు తేల్చుకోలేక అనుష్కనే కథానాయికగా ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

అనుష్కతో చర్చలు..

అనుష్కతో చర్చలు..

సాహో చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క నటింపజేయాలని నిర్ణయం తీసుకొన్నాం. ఆ మేరకు చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నాం. ఇంకా హీరోయిన్ ఎంపికపై ఎలాంటి నిర్ణయానికి రాలేదు. అనుష్క కూడా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. మరికొంత సమయం కావాలని ఆమె చెప్పారు. ఆమె నిర్ణయం కోసం వేచిచూస్తున్నాం అని చిత్ర యూనిట్‌కు సంబంధించిన కీలక వ్యక్తులు వెల్లడించారు.

ప్రభాస్‌తో పెళ్లి వార్తలతో మనస్తాపం

ప్రభాస్‌తో పెళ్లి వార్తలతో మనస్తాపం

బాహుబలి2 తర్వాత ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకొంటున్నారనే వార్తలు జోరందుకున్నాయి. అయితే మీడియాలో ప్రముఖంగా వస్తున్న వార్తలపై అనుష్క మనస్తాపానికి గురైనట్టు సమాచారం. తన పెళ్లి గురించి దుష్ప్రచారం చేస్తున్న సిబ్బందిని ఇటీవల అనుష్క తొలగించిన సంగతి తెలిసిందే.

బిల్లాను హిందీలోకి అనువాదం చేసే..

బిల్లాను హిందీలోకి అనువాదం చేసే..

ప్రభాస్, అనుష్క మధ్య అఫైర్ జాతీయ పత్రికలను ఆకర్షించింది. ఆ వార్తతో లబ్ది పొందడానికి బిల్లా చిత్రాన్ని హిందీలో అనువాదం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. బిల్లాలో అనుష్క, ప్రభాస్‌ల కెమిస్ట్రీకి మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే.

సాహో కోసం ముంబైలో కార్యాలయం..

సాహో కోసం ముంబైలో కార్యాలయం..

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూ.150 కోట్ల వ్యయంతో సాహో చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రం కోసం ముంబైలో ఓ కార్యాలయాన్ని ప్రభాస్ ప్రారంభించారనే వార్తను బాలీవుడ్ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఈ చిత్రాన్ని తన సొంత ప్రొడక్షన్‌ యువీ క్రియేషన్స్‌లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జూన్‌లో షూటింగ్ ప్రారంభించి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్ నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తున్నది.

జియోనీ కోసం ప్రభాస్ క్లీన్ షేవ్

జియోనీ కోసం ప్రభాస్ క్లీన్ షేవ్

ఇదిలా ఉండగా, జియోనీ కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రభాస్‌ను ఎంచుకోవడం వ్యాపార ప్రకటనల రంగంలో సంచలనం రేపింది. ఈ ప్రకటన కోసం భారీగా రూ.18 కోట్లు చెల్లించినట్టు ఓ వార్త ప్రచారంలో ఉన్నది. ఈ ప్రకటనలో కొత్తగా, యూత్‌ఫుల్‌గా కనిపించడానికి ప్రభాస్ తన మీసాలను తీయించుకోవడం జరిగింది. ఈ ప్రకటనలో యంగ్‌గా కనిపించడానికి క్లీన్ షేవ్ చేసుకోన్న ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

English summary
Saaho Tipped to be made on a budget of Rs 150 crore, the film will be shot in Telugu, Hindi and Tamil. "Anushka is now most-sought -after actress and has been approached to essay one of the female leads, but nothing is fixed yet.'' Speculations are rife that Prabhas too wants the same but Anushka Shetty is taking her own time to say 'yes' to his upcoming film Saaho.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu