»   » జీరో: అనుష్కకు ఒక్క పైసా దక్కలేదు!

జీరో: అనుష్కకు ఒక్క పైసా దక్కలేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్‌లో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన అనుష్క విభిన్నమైన సినిమాలు చేస్తూ దూసుకెలుతోంది. బాహుబలి, రుద్రమదేవి, వర్ణ లాంటి సినిమాలకు అనుష్క తప్ప మరో ఆప్షన్ దొరకడం లేదు దర్శక నిర్మాతలకు. ప్రస్తుతం అనుష్క హై రేంజిలో దూసుకెలుతున్నా..‘సైజ్ జీరో' లాంటి సాధారణ సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనకడలేదు.

ఈ మధ్య పలువురు స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా....ఆ డబ్బును సినిమా నిర్మాణంలోనే ఇన్వెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్లు మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వారు ఇప్పటికే ఇలాంటి చేసారు. తాజాగా సైజ్ జీరో విషయంలో కూడా అనుష్క ఇలానే చేసినట్లు తెలుస్తోంది.


Anushka Shetty Size Zero Size Zero

తనకు రావాల్సిన రూ. 2 కోట్ల రెమ్యూనరేషన్ నిర్మాత పివిపితో కలిసి సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెట్టిందట. సినిమా బాక్సాఫీసు వద్ద బాగా ఆడితే అనుష్కకు లాభాల్లో వాటా దక్కేది. అయితే ఈ చిత్రం కలెక్షన్ల పరంగా నిరాశ పరిచింది. దీంతో అనుష్కకు ఒక్క పైసా కూడా దక్కలేదట.


ఈ సినిమా కోసం అనుష్క చాలా కష్టపడింది. దాదాపు 20 కేజీల బరువు పెరిగింది. ఇపుడు మళ్లీ ఆ బరువును తగ్గించుకోవడానికి కష్టపడుతోంది. మొత్తానికి సైజ్ జీరో సినిమా వల్ల అనుష్కకు సమయం వృధా అవడంతో పాటు.... రూ. 2 కోట్ల రెమ్యూనరేషన్ కూడా లాస్ అయింది.

English summary
Anushka who believed in the Size Zero script not only put on those 17 kilos of weight to give the script a touch of originality but invested her remuneration of around rupees 2 crores along with PVP.
Please Wait while comments are loading...