»   »  అనుష్కతోనే ప్రభాస్: దాదాపు కన్ఫార్మ్ అయిపోయింది

అనుష్కతోనే ప్రభాస్: దాదాపు కన్ఫార్మ్ అయిపోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో ప్రభాస్‌, అనుష్క జోడీకి విపరీతమైన క్రేజ్‌ ఉంది. వీరిద్దరూ 'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి'లో జంటగా కనిపించి అభిమానులను అలరించారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం 'సాహో'. సుజీత్‌ దర్శకుడు. ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్న విషయాన్ని ఇప్పటిదాకా ప్రకటించలేదు. కథానాయిక ఈమేనంటూ పలువురు బాలీవుడ్‌ భామల పేర్లు బయటికి వచ్చాయి. తాజాగా ఇందులో అనుష్కను ప్రభాస్‌ సరసన తీసుకున్నట్లు సినీ విశ్లేషకుడు రమేశ్‌ బాలా ట్వీట్‌ చేశాడు.

బాలీవుడ్‌ స్టార్‌

బాలీవుడ్‌ స్టార్‌

హిందీ, తమిళంలో కూడా రిలీజ్‌ అయ్యే ఈ చిత్రం కోసం ఎవరైనా బాలీవుడ్‌ స్టార్‌ని తీసుకొద్దామని చూసారు కానీ 'బాహుబలి'కి జంట కట్టడానికి వాళ్లేమీ అంత ఆసక్తి చూపించలేదు. అక్కడి బి గ్రేడ్‌ హీరోయిన్లు కూడా ఇందులో నటించడానికి అయిదారు కోట్లు కావాలంటూ డిమాండ్‌ చేస్తుండేసరికి నిర్మాతలు చేతులెత్తేసారు.సాహోకి బెస్ట్‌ ఆప్షన్‌

సాహోకి బెస్ట్‌ ఆప్షన్‌

వాళ్లకంటే బాహుబలిలో ప్రభాస్‌కి జంటగా నటించిన అనుష్కని పెడితే ఎక్కువ లాభమని భావిస్తూ ఆమెతోనే మంతనాలు నడుపుతున్నారని సమాచారం. బాహుబలి వల్ల నార్త్‌ ఇండియాలో ప్రభాస్‌ ఎంత పాపులర్‌ అయ్యాడో, అనుష్క కూడా అంతే పాపులర్‌ అవడంతో సాహోకి ఆమె బెస్ట్‌ ఆప్షన్‌ అని డిసైడ్‌ అయ్యారట. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇక ఇంకో ఆప్షన్ లేకుండా అనుష్క నే ఫైనల్ అంటున్నారు.వచ్చే ఏడాది విడుదల

వచ్చే ఏడాది విడుదల

నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడిగా వ్యవహరిస్తున్న ఈచిత్ర టీజర్ కు వచ్చిన బజ్ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. తాజా ట్వీట్ తో సాహో సుందరి ఎవరన్న విషయంపై ఒక క్లారిటీ వచ్చినట్లేనని చెప్పక తప్పదు.అధికారికంగా

అధికారికంగా

మరో విశేషం ఏమిటంటే.. బిల్లాతో మొదలైన ప్రభాస్.. అనుష్క కాంబినేషన్ తాజా సాహోతో నాలుగోది కావటం గమనార్హం. మరి.. ఈ ట్వీట్ను సాహో చిత్రబృందం అధికారికంగా ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తుందా? అని ఎదురు చూస్తున్నారు సహో కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు.
English summary
As per the Latest reports, Prabhas will romance none other than Anushka Shetty in his next big screen outing ‘Sahoo’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu