»   » అనుష్కతోనే ...మళ్లీ మళ్లీ, అందులోనే మజాకా

అనుష్కతోనే ...మళ్లీ మళ్లీ, అందులోనే మజాకా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరూ అంటే అనుష్క...అని కళ్లు మూసుకుని చెప్తారు.‌ తెలుగు సినీ పరిశ్రమలోకి నాగార్జునతో చేసిన చిత్రం 'సూపర్‌'తో సూపర్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క కెరీర్ సూపర్ గా దూసుకుపోతోంది .

అప్పటి నుంచి ఆమె అవకాశం ఉన్నప్పుడుల్లా నాగార్జున గురించి గొప్పగా చెబుతూనే ఉంది. తనకు సినీ జీవితాన్ని ప్రసాదించినది నాగార్జునే అని చెబుతుంది. నాగార్జున ఎప్పుడు తన చిత్రాలలో నటించాలని కోరినా తాను వెంటనే గ్రీన్‌ సిగల్‌ ఇచ్చేస్తానని కూడా చెప్పింది. ఆ మాటను ఆమె నిలబెట్టుకుంటూనే వస్తూంది.

తన కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా నాగార్జున సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేయమన్నా, చిన్న గెస్ట్ రోల్ చేయమన్నా కూడా ఆమె వెనకాడడటం లేదు. తాజాగా ఆమె మరోసారి మళ్లీ నాగార్జున చిత్రంలో నటించడానికి ఓకేసిందని సిని నగర్ వర్గాల సమాచారం.

నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందనున్న నమో వెంకటేశాయ చిత్రంలో ఆమె కనిపించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే ఆమె సినిమాలో అమ్మవారుగా..,.అలివేలు మంగగా కానీ పద్మావతిగా కానీ కనిపించనుంది.

నాగ్, అనుష్క కాంబినేషన్ చిత్రాలు ఇవిగో..

సూపర్

సూపర్

పూరి జగన్నాధ్, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సూపర్ చిత్రంద్వారా అనుష్క వెండితెరకు పరిచయమైంది.

డాన్

డాన్

రాఘవేంద్ర లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన డాన్ చిత్రంలోనూ అనుష్క హీరోయిన్ గా నటించింది.

రగడ

రగడ


వీరూపొట్ల దర్సకత్వంలో రూపొందిన రగడ చిత్రంలో నాగ్ సరసన ఆమె హీరోయిన్ గా చేసింది.

ఢమురకం

ఢమురకం

శ్రీనివాస రెడ్డి దర్సకత్వంలో రూపొందిన ఢమురకం చిత్రంలోనూ అనుష్క హీరోయిన్ గా చేసింది.

కేడీ

కేడీ

నాగార్జన కెరీర్ లో డిఫరెంట్ పాత్రలో కనిపించిన కేడీ చిత్రంలోనూ అనుష్క ...స్పెషల్ రోల్ చేసింది.

కింగ్

కింగ్


శ్రీను వైట్ల దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన కింగ్ చిత్రంలో అనుష్క...స్పెషల్ సాంగ్ లో కనిపించింది.

సోగ్గాడే చిన్ని నాయినా

సోగ్గాడే చిన్ని నాయినా

రీసెంట్ గా రిలీజైన నాగ్ చిత్రం సోగ్గాడే చిన్ని నాయినా లోనూ అనుష్క స్పెషల్ అప్పీరియన్స్ పాత్రలో కనిపించి అలరించింది.

నమో వెంకటేశాయ

నమో వెంకటేశాయ

వెంకటేశ్వరస్వామి భక్తుడు హాతీరాం బాబా జీవితం ఆధారంగా..కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందనున్న నమో వెంకటేశాయ చిత్రంలోనూ ఆమె ఓ కీలకమైన పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.

English summary
Anushka Shetty, who recently appeared in the guest roles in Nagarjuna's Soggade Chinni Nayana and Oopiri, is apparently playing the female lead in the actor's next, in the direction of K Raghavendra Rao.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu