»   » ఆ రెండు సినిమాలకే కష్టం భరించాను...అనూష్క

ఆ రెండు సినిమాలకే కష్టం భరించాను...అనూష్క

Posted By:
Subscribe to Filmibeat Telugu

అరుంధతి, పంచాక్షరి సినిమాల వల్ల నాకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చాలా ఉపయోగం జరిగింది. సినిమా అంతా ఒక్కరి మీదే ఆధారపడితే ఎంత కష్టపడాలో తెలిసొచ్చింది. నేను రెండు సినిమాలకే ఆ కష్టం భరించాను. కానీ హీరోలు అలా కాదు. మొదటి సినిమా నుంచీ వాళ్లు ఇలానే ప్రయాణం చేయాలి. అందుకే ఓ సినిమా విజయం సాధిస్తే... మార్కులన్నీ వాళ్లకే వెళ్లిపోయినా తప్పుపట్టకూడదు'' అ అంటూ చెప్పుకొచ్చింది అనూష్క. ఈ మధ్యన జెనీలియా వంటి కొందరు హీరోయిన్స్ ...ఇది హీరోల రాజ్యం ఇక్కడ వారి చెప్పినట్లే జరుగుతుందంటూ కామెంట్ చేయటాన్ని దృష్టిలో పెట్టుకుని అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం చెప్పింది.

అలాగే.... ''మీరు హీరోకి వస్తున్న పేరొక్కటే చూస్తున్నారు. అందుకోసం వాళ్లు పడే కష్టం ఎంతమందికి తెలుసు? నేను కళ్లారా చూశాను. ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడానికి ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. దానితో పోల్చుకొంటే మేం పడే కష్టం ఎంత? అంటూ చెప్పుకొచ్చింది. ఇక అనూష్క తాజాగా పవన్ కళ్యాణ్,సింగీతం శ్రీనివాసరావు దర్సకత్వంలో రూపొందుతున్న జీసస్ క్ట్రైస్ట్ అనే చిత్రంలో ఎంపికయింది. అలాగే ప్రభాస్ సరసన రెబెల్ చిత్రంలోనూ, నాగార్జున సరసన ఢమరుకం చిత్రంలోనూ కమిటైంది.

English summary
Anushka is pairing up with Pawan Kalyan, for the first time. She has been roped in to play female lead in the film being directed by veteran director Singeetam Srinivas Rao and produced by Konda Krishnam Raju.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu