»   »  అనూష్క 'బికినీ' తిప్పలు

అనూష్క 'బికినీ' తిప్పలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Anushka
బెంగుళూరు భామ అనూష్క కాస్త ఒళ్ళు చేసిందనే సంగతి బలాదూర్ చూసిన ఎవరైనా గుర్తిస్తారు. దాంతో ఇప్పుడామెకి ఓ చిక్కు వచ్చి పడిందని తెలుస్తోంది. తాజాగా ఆమె కమిటయిన భిళ్ళా రీమేక్ కోసం తగ్గి కనపడాల్సిన స్ధితి వస్తోందిట. దర్శక,నిర్మాతలు ఆ విషయాన్ని ఆమెకు అన్యాపదేశంగా చెప్పారుట. ఇంతకీ ఏంటా అవసరం అంటే తమిళ ఒరిజనల్ లో నయనతార బికినీతో చేసిన సన్నివేశాలే అక్కడ హైలెట్ గా నిలిచి సినిమాను నిలబెట్టాయిని తెలవటంట. దాంతో ఆ పాత్రకు అనూష్క ఎంపిక కావటంతో ఆమె బికినీలో ఈ పెరిగిన ఒళ్ళుతో కనపడితే బాగోదని అందుకే ట్రిమ్ అవ్వాలనీ చెప్పటం జరిగిందిట.
ఇక ఆ సైజుకి రావటం కోసం ఆమె ఇప్పడు పడరాని పాట్లు పడుతోందిట.వాటర్ ధెరపీ , పచ్చి కూరలు తినటం, మరిచిపోయిన యోగా మళ్ళీ ప్రారంభించటం వంటి నిర్ణయాలు తీసుకుందిట. దాంతో ఆమె మంచి పాత్ర వచ్చిందని సంబరపడితే సరిపోదు. ఆ పాత్ర పోషణ కోసం తగినట్లు ఒళ్ళు తగ్గించుకోవాల్సి ఉంటుంది అని నిట్టూరుస్తూ చెపుతోందిట. ఇక ఈ సినిమాలో అజిత్ పాత్రను ప్రభాస్ చేస్తున్నారు. కంత్రి ఫేమ్ మెహర్ రమేష్ డైరక్ట్ చేస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X