»   »  పవన్ కళ్యాణ్‌పై మోజు పడుతున్న అనుష్క

పవన్ కళ్యాణ్‌పై మోజు పడుతున్న అనుష్క

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Anushka
హైదరాబాద్: తెలుగు తెర అందాల నటి అనుష్క ఇప్పుడు రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోంది. దాదాపు అగ్రహీరోలతో నటించిన ఈ కథానాయిక ఫలానా హీరోతో కలిసి నటించాలని వుందని చెప్పిన ఉదంతం లేదు. కానీ ఇప్పుడు అనుష్క తన మనసులోని మాట పైకి చెప్పింది.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి నటించాలని వుందని అనుష్క చెప్పింది. ఇప్పటి వరకు అనుష్క పలువురు హీరోల పక్కన నటించినప్పటికీ పవన్ కల్యాణ్ సినిమాలో మాత్రం నటించలేదు. ఎప్పటికప్పుడు ఆ అవకాశం వస్తుందనుకోవడం, తీరా రాకపోవడంతో ఆమె కాస్తా విసిగిపోయినట్లుంది.

"పవన్ కల్యాణ్‌తో చేయాలని వుంది. ఒకవేళ 'గబ్బర్‌సింగ్-2'లో అవకాశం వస్తే కనుక వెంటనే ఒప్పేసుకుంటాను" అంటూ చెప్పింది అనుష్క. అయితే, ఇప్పటికే బాలీవుడ్ భామ అసిన్ ఈ సినిమాకు ఎంపికైందనే వార్తలు వస్తున్నాయి. మరి అనుష్క కోరిక తీరుతుందో లేదో చూడాలి.

అనుష్క రుద్రమదేవి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి చిత్రంలో కూడా నటిస్తోంది. ఆమె నటించిన మిర్చి, సింగమ్ వంటి చిత్రాలు విజయాన్ని సాధించాయి.

English summary
Tollywood heroine Anushka, who is busywith Rudramadevi and Bahubali wants act in Pawan Kalyan's Gabbar Singh - 2
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu