»   » చిరంజీవి 'స్టాలిన్' లో ఐటం సాంగ్ చేసినప్పుడు...అనుష్క

చిరంజీవి 'స్టాలిన్' లో ఐటం సాంగ్ చేసినప్పుడు...అనుష్క

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి గారు నటించిన 'స్టాలిన్‌', నాగార్జున చేసిన 'కేడి' చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌ చేసినప్పుడు నా ఆత్మీయులు కొంతమంది 'క్రేజీ హీరోయిన్‌గా సినిమాలతో బిజీగా వున్న నీవు ప్రత్యేకగీతాలు ఎందుకు చేస్తున్నావు' అని ప్రశ్నించారు. కానీ...నా దృష్టిలో రెగ్యులర్‌ హరోయిన్ పాత్రల కంటే అప్పుడప్పుడు చేసిన ఐటెంసాంగ్స్‌నే ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుంచుకుంటారు అంటోంది అనుష్క. ఆమె ఈ విషయాన్ని మరింత వివరిస్తూ... ఉదాహరణకు ఐశ్వర్య రాయ్‌ చేసిన 'కజరారే' సాంగ్‌ గురించి చెప్పుకోవచ్చు. ఆ పాటల గురించి ప్రేక్షకులు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారంటే ప్రత్యేక గీతాలకు ఎంత ప్రాధాన్యత వుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే...కెరీర్ ‌లో మార్పు కోసం అప్పుడప్పుడు ప్రత్యేక గీతాలు చేయాలనిపిస్తుంది. అలా అని ఐటెం సాంగ్స్ ‌ను కంటిన్యూ చేస్తానని చెప్పడం లేదు. ప్రత్యేక పాటకు నర్తించాలా? వద్దా? అనేది ఆయా సందర్భాల్లో నా మైండ్‌ సెట్ ‌పై ఆధారపడి వుంటుంది' అంటూ చెప్పుకొచ్చారామె. అనుష్క ప్రస్తుతం తమిళ వేదం లోనూ, మహేష్ ప్రక్కన కలేజా చిత్రంలోనూ, నాగార్జున, వీరూ పోట్ల కాంబినేషన్ చిత్రంలోనూ చేస్తంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu