For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెక్సీ అనుష్కను మగ రాయుడిలా చూడగలమా?

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: సౌతిండియాలో తన సెక్సీ సొగసులతో అందరికీ అభిమాన తార అయింది హాట్ హారోయిన్ అనుష్క శెట్టి. కేవలం తన అందచందాలతో మాత్రమే కాదు, కరుకుగా మగరాయుడిలా యాక్షన్ సీన్లు చేయడం కూడా ఆమె ప్రత్యేకత. తాజాగా రుద్రమదేవి చిత్రంలో ఆమె వీరనారి పాత్ర పోషిస్తోంది.

  సినిమాలో ఆమె కొన్ని సన్నివేశాల్లో పూర్తిగా మగరాయుడిలా పెర్ఫార్మెన్స్ అదరగొట్టిందట. కాకతీయ సామ్రాజ్యంలో ఓ యువతికి కిరీటం అప్పజెప్పినప్పుడు మగాడిగానే తనని పరిగణించారు. రుద్రమదేవి అని కాదు రుద్ర దేవ అని ప్రస్తావించారు. రుద్రదేవ సారథ్యంలో సైన్యం శత్రు రాజ్యంపై దండెత్తే సన్నివేశాలు సినిమాకు హైలెట్ అవుతాయని అంటున్నారు. యుద్ధ సమయంలో ఆమె వేషం, శ్రతుసైన్యంపై విరుచుకుపడే తీరు మగరాయుడిని తలపిస్తుందని అంటున్నారు.

  న్యూఇయర్ కానుకగా ‘రుద్రమ దేవి' చిత్రానికి సంబంధించి అనుష్క ఫస్ట్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆమె రెగల్ లుక్ అదిరిపోయే విధంగా ఉందనే టాక్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ సంక్రాంతికి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  Anushka will be seen in a 'male' getup

  అనుష్క టైటిల్ రోల్ లో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగినీ గుణ సమర్పణలో డైనమిక్ డైరెక్టర్ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి'. రానా ముఖ్య పాత్రధారి. నిరువధ్యపురం యువరాజు.. చాళుక్య వీరభధ్రుడుగా రానా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

  సినిమా గురించి దర్శక నిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ..‘భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా రూపొందుతున్న మా రుద్రమదేవి చిత్రానికి సంబంధించి ప్రస్తుతం శరవేగంగా పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. గతంలో రిలీజ్ చేసిన రుద్రమదేవి ఫస్ట్ లుక్‌కి, అల్లు అర్జున్ చేస్తున్న గోన గన్నారెడ్డి ఫస్ట్‌లుక్‌కి చాలా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు అనుష్క తొలి మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నాం' అన్నారు.

  ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

  English summary
  Director and Producer Gunasekhar is now coming up with "Rudramadevi 3D", which features the life and times of the Kakatiya queen and her regime. Already first look of Anushka as a gracious queen sitting on Kakathiya throne has impressed one and all. In a couple of scenes, Anushka will be seen in a 'male' getup and it will be tough for movie lovers to identify her, says a source in the know.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X