twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంట్లోనే తొక్కేస్తారు, తెలుగు అమ్మాయిని కాబట్టే ఇలా : యాంకర్ అనసూయ

    |

    సోషల్ మీడియాలో అనసూయ ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ఆమెను ట్రోల్ చేసే వారు కూడా చాలా మందే ఉంటారు. వేసుకునే డ్రెస్, మాట్లాడే మాటలను తప్పుబడుతూ ట్రోల్ చేస్తూ ఉంటారు. ఎందుకు మీపై ఇలాంటి ట్రోలింగ్ జరుగుతోంది అనే ప్రశ్నకు 'దిల్ సే' అనే కార్యక్రమంలో అనసూయ తనదైన శైలిలో స్పందించారు.

    నేను చాలా ట్రోల్స్ ఫేస్ చేశాను. ఈ విషయంలో నాకంటూ ఒక అండర్ స్టాండింగ్ వచ్చేసింది. నేను ఇపుడు ఏం మాట్లాడినా వేరే వాళ్లను ఉద్దేశించి కాదు. నా లైఫ్, నా అనుభవంతో నేనొక అండర్ స్టాండింగ్‌కు వచ్చాను అంటూ అనసూయ తన మనసులోని మాటలను బయట పెట్టారు.

    తెలుగు అమ్మాయిని కాబట్టే ఇలా

    తెలుగు అమ్మాయిని కాబట్టే ఇలా

    హిందీలో ఒక కహావత్ ఉంది. ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్ అన్నట్లు.. నేను తెలుగు అమ్మాయిగా ఉండి అందరిలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండటం, హెడ్ లైన్స్ లోకి రావడం, లైమ్ లైట్లో ఉండటం, మనపై ఎక్కువ ఫోసక్ పడేలా ఒక తెలుగు అమ్మాయి చేయడం వల్లే ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇదే ఫేజ్ ఆఫ్ లైఫ్... పెళ్లి చేసుకుని, పిల్లలను కని, వివిధ పాత్రలు చేస్తూ, మోడ్రన్‌గా ఉండి వారు తెలుగు వారు కాకపోతే వహ్వా వహ్వా అంటారు.

    ఇంట్లోనే తొక్కేస్తారు

    ఇంట్లోనే తొక్కేస్తారు

    దీనికి మళ్లీ 2 వెర్షన్లు ఉన్నాయి.. వేరే ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిలు ఎలా ఉన్నా పర్లేదు మేము చొంగకార్చుకుంటాం, చూస్తాం అనే విధంగా కొందరు ఉంటారు. అదే మన ఇంట్లో అమ్మాయిలు అయితే అమ్మో.. వద్దు, నో అనే ధోరణితో ఉంటారు. ఎవరైనా ఆడపిల్లలే, ఎవరిదైనా స్ట్రగులే, ఎవరి డ్రీమ్స్ అయినా డ్రీమ్సే... ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంటే. మన దగ్గర లేని టాలెంట్ అనేది లేదు. తెలుగులో కుటుంబాల్లో ఎంతో మంది బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. కానీ వారిని ఇంట్లోనే తొక్కేస్తారు. అఫ్ కోర్స్ వాళ్ల భయం కూడా ఉంది.

    నువ్వు బ్రతకనేర్వాలి అని చెప్పాలి

    నువ్వు బ్రతకనేర్వాలి అని చెప్పాలి

    ఒక అమ్మాయి ఏదైనా చేస్తా అంటే ఇండస్ట్రీ అలాంటిది అని చెప్పేయకూడదు. ప్రపంచం అలా ఉందమ్మా.. నువ్వు బ్రతకనేర్వాలి అని చెప్పాలి. కానీ అవేమీ చెప్పకుండా ఇండస్ట్రీకి వద్దు అంటున్నారు. ఆ స్ట్రగుల్ ఏమిటో ఫేస్ చేసిన తర్వాత డిసైడ్ అవ్వు అని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఆమె ఒకటి చేయాలి అనుకుంటే తనకు తెలిసే చేస్తుంది, తెలియకచేస్తే మళ్లీ చేయదు, నేర్చుకుంటుంది.

    పెద్దలు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకు అనొచ్చు

    పెద్దలు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకు అనొచ్చు

    పెద్దలు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకు అనొచ్చు. కానీ ఇపుడు ఆ టైమ్ మాదిరిగా ఇపుడు లేము కదా. అందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. అప్పటిలానే ఎడ్లబండిలోనే వెళదామంటే ఎలా? ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా మానం మారాలి. అలా ఉన్నా బ్రతకలేం... ఇలా ఉన్నా బ్రతక నివ్వరు అంటే ఎలా? ఎలాగో అలా బ్రతకనివ్వండి. ఇంట్లోనే తొక్కేయడం ఆగాలి. అలా ఇంట్లో తొక్కేయాలని చూసినపుడు మా నోటి నుంచి కూడా ఒక మాట వస్తుంది. నీలాగే అవ్వాలా? నీలాగే బ్రతకాలా? అని అనాలనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఎవరినైనా బాధిస్తాయి.

    నన్ను విమర్శించే వారు టకీమని 9.30 గంటలకు టీవీ ఆన్ చేసి ప్రోగ్రాం చూస్తారు

    నన్ను విమర్శించే వారు టకీమని 9.30 గంటలకు టీవీ ఆన్ చేసి ప్రోగ్రాం చూస్తారు

    నా డ్రెస్సు మీద ట్రోల్స్ చేసేవారు, నన్ను విమర్శించే వారు టకీమని 9.30 గంటలకు టీవీ ఆన్ చేసి ప్రోగ్రాం చూస్తారు. నన్ను చూసి నేను గర్వపడుతున్నాను. ఎవరి కష్టం వారిదే. మీ గురించి మాకు తెలియదు. అందుకే ఎవరూ ఎవరిని జడ్జ్ చేయకూడదు. మీరు ఇక్కడి దాకా వచ్చారంటే... మీలాగా నేనూ చేస్తే నేను అక్కడికి రాలేనేమో? నాది వేరే డెస్టినీ ఉంటుంది, ఎక్కడో అక్కడ మారుతుంది. ఆ కారణంగానే నేను టార్గెట్ అవుతున్నానేమో.

    అంతకు మించి ఏముంటుంది?

    అంతకు మించి ఏముంటుంది?

    ఇంతకు ముందు చెప్పినట్లు నాకు కంప్లయింట్స్ లేవు. నేను తట్టుకున్నాను. సర్వైవ్ అయ్యాను. ఇపుడు అవేమీ నన్ను ఏమీ చేయలేవు. అంతకంటే ఇంకేం చేస్తారు అనే మూడ్లోకి వచ్చేశాను, ఎలాంటి పరిస్థితులనైన ఎదుర్కొనే ధైర్యం నాకు వచ్చింది... అని అనసూయ తెలిపారు.

    English summary
    Anusuya said that there is more trolling on the Telugu girl. Anasuya added that other girls would not have such problems and they would be accepted by our Telugu people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X