twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐపీఎల్ ఫిక్సింగ్ కంపు : టాలీవుడ్‌‌కు లేదు లింకు

    By Bojja Kumar
    |

    AP Film Chamber condemned IPL Match Fixing issue
    హైదరాబాద్ : ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల హస్తం ఉందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కంపులో రమేష్ వ్యాస్ అనే ఓ టాలీవుడ్ నిర్మాత కూడా వేలు పెట్టాడంటూ వార్తలు వెలువడ్డాయి. దీంతో ఉలిక్కిపడ్డ తెలుగు చిత్ర పరిశ్రమ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వార్తలను ఖండించింది.

    తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతల మండలి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...ఐపీఎల్ ఫిక్సింగుకు, టాలీవుడ్‌కు ఎలాంటి లింకు లేదని తేల్చి చెప్పారు. రమేష్ వ్యాష్ అనే వ్యక్తి తెలుగు చిత్ర సీమలో ఎవరూ లేరని, అతనికి పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసారు.

    ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ...కాస్టింగ్ డైరెక్టర్ అనేది తెలుగు చిత్ర పరిశ్రమలో లేదని, అది బాలీవుడ్ సంస్కృతి అని స్పష్టం చేసారు. టాలీవుడ్‌కు, ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగుకు సంబంధం లేదని చెప్పిన ఆయన....ఎవరైనా నిర్మాతలు మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి వ్యవహారాల్లో వేలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    ఎక్కడో ఏదో వార్త వినిపిస్తే...తెలుగు చిత్ర పరిశ్రమను బ్లేమ్ చేయవద్దని నిర్మాతలు స్పష్టం చేసారు. ఇటీవల డ్రగ్స్ వ్యవహారం, ఇతర నేరాల్లో ఎవరో ఒకరు పట్టుబడితే దాన్ని మొత్తం పరిశ్రమకు ఆపాదిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల పరిశ్రమకు చెడ్డ పేరు వస్తుందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేసారు.

    English summary
    
 AP Film Chamber condemned IPL Match Fixing issue. Chamber president Tammareddy Bharadwaja said that Tollywood does not have links with IPL Match Fixing. He confirmed that the Accused person Ramesh Vyas is not a member of Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X